Telugu Samethalu Lettter AE(ఏ)
ఏకముండం గృహచ్చిద్రం ద్విముండం గృహనాశనం త్రిముండం గ్రామనాశంచ చతుర్కుండంచ పట్టణం అధవా పంచముండంచ బ్రహ్మపట్ల వినశ్యతి
ఏకాదశ బ్రాహ్మడా అంటే కాలేకొరివి యెగసన తోస్తావా అన్నాడట ద్వాదశ బ్రాహ్మడా అంటే ఆపదలు కాపురాలు చేస్తవా అన్నాడట
ఏకాదశినాడు కాలు అంటుకుంటా వేమి అంటే అది నిత్యవ్రతము నేడే ఆరంభము అన్నాడట. మర్నాడు తల యెందుకు అంటుకోలేదు అంటే నిన్నటితో వ్రతసమాప్తి అన్నాడట
ఏకాలు జారినా పిఱ్ఱకే మోసము
ఏకులవంటి మెతుకులు పోసుకుని యెనుప పెరుగు నేను కొని యవరాలిని గనుక తింటున్నాను గాని దగ్గరకు రాకండి పిల్లల్లారా జడుసుకునేరు
ఏగాలికి ఆ చాపయెత్తినట్లు
ఏటి అవతలి ముత్యములు తాటికాయలంతేసి
ఏటి యీతకు లంకమేతకు సరి
ఏటికి యెప్పుడు పోయినావు, యిసుక యెప్పుడు తెచ్చినావు అంటే ఆడువారు తలిస్తే అది యెంతసేపు అన్నదట. మగవారు తలిస్తే యిది యెంత సేపు అని నాలుగు బాదినాడట.
ఏటిదరి మ్రానికి ఎప్పుడు చలనము
ఏటివద్ద నక్కకాగానే పాటిరేవు ఎరుగునా
ఏటివొడ్డు చేను
ఏట్లో ఉదకమున్నది సూర్యదేవా
ఏట్లో వేసినా యెంచి వేయవలెను
ఏట్లోకలిపిన చింతపండు
ఏట్లోనా రేనీళ్ళు యెవరుతాగితేయేమి
ఏట్లోపడ్డవానికి యెన్నో యెన్నికలు
ఏట్లోవంకాయలు కాస్తవా అంటే కాస్తవి అన్నట్లు.
ఏడిచే బిడ్డకు అరటిపండు చూపినట్లు
ఏడిచేదాని మొగుదువస్తే నమొగుడు వస్తాడు
ఏడుపులో ఏడుపు యెడమచెయ్యి బయట పెట్టాన్నట్టు
ఏడుస్తూ యేరువాక సాగితే కాడిమోకులు దొంగలెత్తుకపోయినారట
ఏతాంపాటకు యెదురుపాట లేదు
ఏదీకానివేళ గేదెయీనినట్లు
ఏదుకు పెడతల బుద్ధి
ఏదుముందా ? ఏరువాక ముందా!
ఏనుగంత తండ్రి యుండుట కంటె యేకంత తల్లి యుండుటమేలు
ఏనుగకు ఒకసీమ, గుఱ్ఱానికి ఒకవూరు, బఱ్ఱెకు ఒక బానిస
ఏనుగనుచూచి కుక్క మొరిగినట్లు
ఏనుగనుతెచ్చి యేకులబుట్టలోపెట్టి అది నెత్తిన బెట్టుకొని తన్నుయెత్తుకో అంటాడు
ఏనుగు నెక్కినవారు కుక్క కూతకు జడియరు
ఏనుగు పడుకొన్నా గుఱ్ఱము మంత యెత్తు
ఏనుగు మింగిన వెలగపండు
ఏనుగు యెత్తుపడితే దోమ దొబ్బసాగెనట
ఏనుగుకుకాలు విరగడము దోమకురెక్క విరగడము సమము
ఏనుగుమదిస్తే నెత్తినమన్ను వేసుకుంటుంది
ఏనుగుమీద దోమవాలితే యెంతబరువు
ఏనుగుమీద పోయేవాణ్ణి సున్నమడిగినట్లు
ఏనుగుల పోట్లాటకు యెట్రింత రాయభారం
ఏనుగులు తినేవాడికి పీనుగులు పిండివంటా
ఏపాటా చావకపోతే బాపట్లపంపండి
ఏపాటుతప్పినా సాపాటు తప్పదు
ఏపుట్టలో యేపామున్నదో
ఏమి అప్పాజీ అంటే కాలంకొద్ది రాయాజీ అన్నాడట
ఏమిచేసినా సమకాలంవారు మెచ్చరేకదా!
ఏమిపోలిశెట్టి అంటే యెప్పటి మొత్తుకోళ్ళే అన్నాడట
ఏమీతోచకపోతే యెక్కిరించినాడట
ఏమీలెనమ్మకు యేడ్పులశృంగారం కలిగినమ్మకు కడుపుల శృంగారం
ఏమీలేని ఆకులు యెగిరిపడితే అన్నీవున్న ఆకులు అణిగివుంటవి
ఏయెండ కా గొడుగు
ఏరు ఏడామాడవుండగానే చీరవిప్పి చంకన బెట్టుకొని పోయినట్లు
ఏరు తీసినట్లు
ఏరు నిద్రపోయినట్లు
ఏరు మూరెడు తీస్తే కయ్య బారెడు తీస్తుంది.
ఏరుకొని తినే పక్షి ముక్కున ముల్లు విరిగినట్లు
ఏరుదాటి తెప్ప కాల్చినట్లు
ఏరెంత పారినా కుక్కకు గతుకు నీళ్ళే
ఏరెన్ని వంకలు పోయినా సముద్రములోకే
ఏరైనా మూడు నేరాలు కాస్తుంది
ఏలినవారికి వూళ్లు లేకపోతే ఎత్తుకు తినడానికి లేవా?
ఏలుకోవడానికి వూళ్లు లేకపోతే ఎత్తుకు తినడానికి లేవా?
ఏలేవాని యెద్దు పోతేనేమి, కాచేవాని కన్ను పోతేనేమి?
ఏవూరు యేతము అంటే, దువ్వూరే దూలమా అందిట
ఏనుగు వెలక్కాయ లొటలొట
Post a Comment