Telugu Samethalu Lettter BA(బ)
బంగారపుపొల్లు వున్నదిగాని మనిషిపొల్లులేదు
బంగుతిన్న కోతివలె తిరుగుతాడు
బండియెద్దు అమ్మినవానిబ్రతుకు బంది
బంధువుండవు సరేగాని పైరులో చెయ్యి పెట్టవద్దు
బక్కవానికి బలసినవాడు బావ బలసినవానికి బక్కవాడు బావ
బగబగ మనువాని పంచను వుండవచ్చునుగాని ముచ్చువాని పంచను వుండరాదు
బట్టతలకు మోకాళ్ళకు ముడివేసినట్లే వున్నది
బట్టప్పు పొట్టప్పు నిలవదు
బడాయి బారెడు పొగచుట్ట మూరెదు
బడాయికి బావగారాఅంటే యేమె గుడ్దికంటి మరదలా అన్నట్టు
బడాయికి బావగారువస్తే యీడవలేక యింటిల్లిపాది చచ్చిరి
బడిఒలెని చదువు వెంబడిలేని సేద్యము కూదదు
బడేసాయిబు గడ్దము బారెడై తేనేం మూరడైతేనేమి
బడేసాయిబు జోశ్యులూ తొలియేకాదశెన్నడు
బయటతన్ని యింట్లో కాళ్లుపట్టుకున్నట్లు
బర్రెకొమ్ము అంటే యిర్రికొమ్ము అంటాడు
బఱ్ఱె దూడవద్దా పాతప్పుల వానివద్ద వుండరాదు
బఱ్ఱె పెంటతింటే పాలు చెడుతున్నవా
బఱ్ఱెచస్తే పాడిబయట పడుతుంది
బఱ్ఱెపాడెన్నాళ్లు బాగ్యమెన్నాళ్ళు
బలవంతాన పిల్లనిస్తానంటే కులమెమి గోత్రమెమి అని అడిగినట్లు
బలవంతుని సొమ్ముగాని బాపడిసొమ్ముగాదు
బలుపుతీరితే గాని వలపుతీరది
బలుస పండితే గొలుసులవలె నుందును
బహునాయకం బాలనాయకం స్త్రీనాయకం
బాధకోకాలం భాగ్యానికో కాలం
బాపడికి పప్పాశ అత్తకు అల్లుడాశ
బాపనవాడి కొలువు తెల్లగుఱ్ఱపుకొలువూ కూడదు
బాపనసేద్యం బడుగులనష్టం కాపులచదివు కాసులనష్టం
బాపనసేద్యం బాలవైధవ్యం ఒకటి
బాపలు తప్పినా వేపలు తప్పము
బాపళ్ళ వ్యవసాయము కాపుల సమారాధనా
బార కాడివలె పడ్డావు నీవెవరు రామా యింటి దేవుడికి మ్రొక్కను
బార కాడివలె పడ్డావు నీవెవరు రామా యింటి దేవుడికి మ్రొక్కను
బాలలేని యింట్లో వృద్ధు డంబాడెనట
బావమరిది బ్రతక గోరును దాయాది చావగోరును
బావా నీభార్య ముండమోసిందోయి అంటే మొర్రోఅనియేడ్చెనట
బావి తవ్వబోగా భూరము బయలు దేరెనట
బావి లోతు చూడవచ్చును కాని మనసులోతు చూడరాదు
బాస తప్పినవాదు బడిందిగినవాడు ఒక్కటే
బిందేడువచ్చి కోడలు కొత్తా లేదు
బిఒడ్డను వేసి లోతుచూచినట్లు
బిచ్చపు కూటికి శనైశ్వర మడ్డం పడ్డట్టు
బిచ్చపువాణ్ణి చూస్తే బీదవానికి కోపము
బిచ్చమువేయకున్నమానె కుక్కనువిడువకు మన్నట్లు
బిచ్చానికిపోయినా బిగువుతప్పలేదు దుప్పటిపోయినా వల్లెవాటుతప్పలేదు
బిడ్డచక్కిలమువలె యెండిపోయినాడంటే చక్కిలాలు యిమ్మని యేడ్చినాడట
బిడ్డయెదిగితే కుండయెదుగుతుంది
బిడ్డలేనిముద్దు వానలేనివరద
బీడునకు కురిసినవర్షం అడివిని కాచినవెన్నెల
బీదవాడు బిచ్చపువానికి లోకువ
బుట్టమీద గొట్ట భుజగంబు చచ్చునా
బుట్టాలోపామువలె మణిగినాడు
బుడ్డను నమ్మి యేటపడ్డట్టు
బుర్రకు ఒక గుణము జిహ్వకు ఒక రుచి
బులుపు తీరిన గాని వలపుతీరదు
బూరుగ పండుకు చిలుక కాచియున్నట్లు
బెదిరించి బెదిరించి బెల్లపుకుండకు తూటు పొడిచినదట
బెలిజె పుట్టుక పుట్టవలె బతాయి బుడ్డి కొట్టవలె
బెల్లం పారేసి ఆకు తాకినత్లు
బెల్లంవుంటే యీగలు ముసురుతవి
బెల్లపు పిళ్ళారికి ముడ్డిగిల్లి నైవేద్యము
బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట
బొంత కట్టుకున్నవాడు కప్పుకోలేడా
బొక్కగొరుకంగ భోగము లెక్కచెప్పంగ దు:ఖము
బొచ్చు కాల్చితే బొగ్గులగునా
బొజ్జను నమ్మి యేట పట్టట్టు
బొటనవేలు సున్నమైతే బోర్లపడుతాడు
బొట్టు కట్తితేగాని ముండ మొయ్యదు
బోగం వలపు బొగ్గు తెలుపు లేదు
బోడితలకు బొడ్డుమల్లెలు ముడిచినట్లు
బోడితలకు మోకాటికి ముడి పెట్టినట్లు
బోడినెత్తిన టెంకాయ కొట్తినట్లు
బోసినోటి వానికి పేలపిండి మీద ప్రీతి
బోసినోటికి చరుకు ముక్క అందించినట్లు
బ్రతకలెనివాడు భావిలోపడితే, తియ్యబోయినవాడు కయ్యలో పడ్డాడట
బ్రతికివుండగా పాలులేవుగాని చచ్చిన తరువాత గంగిగోవును దానం చేస్తానన్నాడట
బ్రతికేబిడ్డ అయితే పాసినవాసన యెందుకు వస్తుంది
బ్రతుకెన్నాళ్లు: భాగ్యమెన్నాళ్ళు?
బ్రహాస్త్రానికి తిరుగులేదు
బ్రహ్మకూ పుట్టుతుంది రెమ్మతెగులు
బ్రహ్మతలిస్తే ఆయుస్సుకు తక్కువా మొగుడు తలిస్తే దెబ్బలకు తక్కువా
బ్రహ్మవ్రాసిన వ్రాలుకు యేడవనా రాగల సంకటికి యేడవనా
బ్రాహ్మడిచెయ్యి యేనుగుతొండమూ వూరుకుండవు
బ్రాహ్మడిమీద సంధ్యా కోమటిమీద అప్పు నిలవదు
బ్రాహ్మణుడు ఒంటిపూటపడ్డా పసరం ఒంటిపూట పడ్డా మానెడు
బ్ర్రహ్మల్లో చిన్న జెస్తల్లో పెద్ద
బ్ర్రాహ్మల్లో నల్లవాణ్ణీ బెస్తల్లో యెర్రవాణ్ణి నమ్మరాదు
బంకారు పళ్లెరమునకైన గోడచేర్పు ఉండవలెను
బంగారు ముచ్చెలైనా కాళ్ళనే తొడగవలెను
బాలనాయకం బహునాయకం స్త్రీ నాయకం
భక్రురాలు లేనిది బావాజీ ఉండదు
భయ మెంతో అంతకోట కట్టవలెను
భరణి కార్తెలో వేసిన నువ్వుచేను కాయకు చిప్పెడు పండును
భరతుడి పట్టం రాముడి రాజ్యం
భాగ్యంవుంటే బంగారం తింటారా
భారము లేని బావచస్తే దూలముపడ్డా దు:ఖములేదు
భారీముద్ర భారీముద్రే కరుకుకరుకే
భారీముద్ర భారీముద్రే కరుకుకరుకే
భార్యచేతి పంచభక్ష్య పరమాన్నములు కన్న తల్లి చేతి తవిటిరొట్టె నయం
భిక్షగాని గుడిసె మాయాక్కచూసి మురిసె
భిక్షాదికారైనా కావలె భిక్షాధికారైనా కావలె
భూమికి వానమేలా అంటే మేలే అన్నట్లు
భూమికిరాజు నాయ్యం తప్పితే గ్రామస్తులేమి చేస్తారు
భోజనం చేసిన వారికి అన్నంపెట్ట వేడుక బోడితలవానికె తలంటువేడుక
భోజనానికి మాబొప్పడు, నేను లెక్కజెప్ప నేనొక్కడనే యన్నాడట
భోజనానికి ముందు స్తానానికి వెనుక
భోజునివంటి రాజు గలిగితే కాళిదాసువంటి కవి అప్పుడే వుంటాడు
Post a Comment