Telugu Samethalu Lettter CHA(చ)
చంకపిల్ల జారిపడేటట్టు మాట్లాడుతాడు
చందమామ రూపాయిబిళ్లవలె జారుతున్నాడు
చంద్రుణ్ణీజూచి కుక్కలు మొరిగినట్లు
చక్కగా కూశోరా చాకలి నాయడాఅంటే, విన్నావటోయి యీడిగనాయడా మంగలినాయడి సరసము అన్నట్లు
చక్కదనాలకు లొట్టిపిట్ట, సంగీతానికి గాడిద
చక్కిలాలు తింటావా చల్దితింటావా అంటే చక్కిలాలూ తింటాను చల్ధీతింటాను అయ్యతోటి వేడి తింటాను అన్నాట్ట
చక్కెర పందిట్లో తేనె వానకురిసినట్లు
చక్కెర పందిట్లో తేనె వానకురిసినట్లు
చచవవేస్తే వున్న మతిపోయించి
చచ్చిన చారమేకపాలు పోయిన బోసిముంతెడు
చచ్చిన పామును గొట్టుట కందరుబంట్లే
చచ్చినతర్వాత తెలుస్తుంది శెట్టిగారి బండారం
చచ్చినవాని తల తూర్పునుంటేనేమి పడమరనుంటేనేమి
చచ్చినవాని పెండ్లికి వచ్చినంత కట్నము
చచ్చినాపయికం తప్పదచ్చమ్మా యిక తిట్టకు
చచ్చేటప్పుడు శంభోశంకరా అనరా అంటే వారింట్లో చెంబు యెత్తుకురా అన్నాడట
చచ్చేటప్పుడు సంధి మం త్రం
చచ్చేదాకా బ్రతికివుంటే పెండ్లి చేస్తానన్నట్లు
చచ్చేవానికి సముద్రం మోకాలిబంటు
చదవనేరుస్తావా వ్రాయనేరుస్తావా అంటే, చదవనేరను వ్రాయనేరను చింపనేరుస్తా నన్నాడట.
చదివేది రామాయణం పడగొట్టేవి దేవళములు
చదువనేర్చిన ఆడుదానితో వండనేర్చిన మగవారితో నోపలేరు
చదువుమాయింటలేదు సంధ్య మావమవంశానలేదు
చదువులలో మర్మమెల్ల చదివివానులేవోయి
చదువూలేదు సంధ్యాలేదు సంతానం మెండు
చద్దన్నం తిన్నమ్మ మొగుడాక లెరుగదు
చద్దితెచ్చుకున్న బ్రాహ్మణుడా భోజనంచెయ్యి
చనువు చేసిన ఆలు చంకనెక్కును
చన్నీళ్ళయినా చల్లార్చుకు తాగవలెను
చలిజ్వరము అన్నములోచెయ్యి తియ్యబుద్దికాదు
చలిపందిలి కుండలకు తూట్లుపొడిచినట్లు
చలిపందిలి కుండలకు రాళ్లు తూట్లుపొడిచినట్లు
చల్లకువచ్చి ముంతదాచినట్లు
చవియెరిగినకుక్క చావకొట్టినాపోదు
చస్తానని చద్దిఅన్నంతింటే చల్లగా నిద్రవచ్చినదట
చాకలికట్టనిగుడ్డ సైనుయెక్కని గుఱ్ఱమూలేదు
చాకలివానిభార్యకు మంగలివాడువిడాకులిచ్చినట్లు
చాపచిరిగితే చదరంతైనా వుండకపోదు
చామలుచల్లి చేనువిడువవలెను
చాలీచాలనందుకు చాకింటిగుడ్డలు చాలావున్నవి
చాలీచాలనందుకు చాకింటిగుడ్డలు చాలావున్నవి
చాలులో చామదున్నితే చేనుచేనుకే అవుతుంది
చావటిముందరికొంప కదపా పుల్లలకుసరి
చావాచావనివ్వడు బ్రతుకాబ్రతుకనివ్వడు
చావుకుమళ్లీ చావు వస్తుందా
చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు
చావ్చుకు పెట్టితేగాని లంఖణాలకు దిగదు
చింత చచ్చినా పులుపు చావదు
చింత పండితే జీడిపండు;తుంది
చింతలేదు చింత లేకపోతే పులుసులేదు
చిక్కి చికిలించేకన్నా వెళ్ళి వెక్కిరించేదిమేలు
చిచ్చాయె చిచ్చాయె అంటే సందాయ నందాయె నన్నట్లు
చిత్త చిత్తము వచ్చినచోట పండును
చిత్త చిత్తరించి స్వాతి దయచేసి విశాఖ విసిరికొట్టకుండావుంటే వీసానికి పుట్టెడు పండుతానన్నదట
చిత్తకార్తెకు ఉలవచేను చిత్తుచిత్తుగా పండుతుంది
చిత్తకురిస్తే చింత పండును
చిత్తము శివునిమీద భక్తి చెప్పులమీద
చిత్తము శివునిమీద భక్తి చెప్పులమీద
చిత్తయెండ పిట్టతల పగులును
చిత్తలో చల్లితే చిట్టెడు కావు
చిత్తవాన యెచ్చట పడితే అచ్చటనే
చిత్తస్వాతి నందుల చినుకులు చాలినంత వర్షమిచ్చును
చిత్తస్వాతులు కురువకుంటే చిగురుటాకులుమాడిపోవును
చిత్తస్వారుల కురువకుంటే చీమకూడా నాంబ్రం
చిదిగ్ పొదిగి చిన్నవానిపెండ్లి చేసేవరకు పెద్దనాని పెండ్లాము పెద్దలలోకలసినది
చిద్రమునకు చీడపేలు దరిద్రమునకు తలపేలు
చినపేరి తాడుతెగితే పెదపేరితాడూ అప్పుడేతెగుతుంది
చిన్న పునర్వసు కార్తెలో చిట్టెడువడ్లు చల్లితే పుట్టేడు వడ్లు పండును
చిన్నక్క చిలక పెద్దక్కగిలక చూస్తేచుక్క రేగితేకుక్క
చిన్నక్కను పెద్దక్కను పెద్దక్కను చిన్నక్కనుచేసేవాడు
చిన్ననాడూలేదు పెద్దనాడూలేదు చంద్ర శేఖరుడినాడు చెవుల పోగులా
చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టవలెను
చిన్నమూ కావలె చిదరా కావలె మేలిమీకావలె మెడ తిరగావలె
చిన్నయిల్లు కట్టుకొని పెద్దకాపురం చేయవలె
చిన్నవాడితండ్రి విద్యాంసుడు చిన్నవాడు చెయ్యందుకుంటే అక్కరలోకి వస్తాడు
చియ్యబువ్వ చీకులాట గొల్లవాడువస్తే గోకులాట
చిలక తనముద్దేగాని యెదటిముద్దు కోరదు
చిలుము వదిలితే చిద్రం వదులుతుంది
చీపురుకట్టకు పట్టుకుచ్చు కట్టినట్లు
చీపురుకు శిరివస్తే కోడియీక గొడుగు పట్టెనట
చీమలు చెట్లెక్కితే భూములుపండును
చీమలుపెట్టిన పుట్టలు పాము కిరువైనట్లు
చీరకట్తినమ్మశృంగారంచూడుగుడ్డకట్టినమ్మకులుకుచూడు
చీరసింగారించేటప్పటికి పట్నం కొల్లపోయినట్లు
చుక్కలూళ్లో చక్కిలాలు తేబోయునాడు
చుట్టమని చూడవస్తే యింటివారంతా దయ్యాలై పట్టుకున్నారట
చుట్టుడు చాప విసురుడు తలుపు పెడసరపు పెండ్లాము
చుట్తూ చూరుమంగళం నడుమ జయమంగళం
చూచిందెల్లా సుంకము సాశిందల్లా వంశము
చూచిరమ్మంటే కాల్చివస్తాడు
చూడక తిరగక చూస్తూ చెయ్యవలసినది
చూడగా చూడగా గుఱ్ఱం గాడిదయింది
చూడచుంచెలుక గోడత్రవ్వ పందికొక్కు
చూడచుట్టము మ్రొక్క దైవమూ లేదు
చూడబోతే చుట్టాలు రమ్మంటే కోపాలు
చూడవచ్చినవారికి శుక్రవారమేమిటి
చూస్తే సుంకం చూడకుంటే బింకము
చెంబు కంచముపోతే మొఖంమీద కొట్టినట్లు ముంతామూకుడు తెచ్చుకోలేనా
చెట్టు నీడకుపోతే కొమ్మవిరిగి మీదపడ్డట్టు
చెట్టు యెక్కించి నిచ్చెన తీసినట్లు
చెట్టు యెక్కేవాణ్ణి యెంతవరకు తొయ్యవచ్చు
చెట్టు యెక్కేవాణ్ణి యెంతవరకు తొయ్యవచ్చు
చెట్టు వేసినవాడు నీళ్ళు పొయ్యడా?
చెట్టుకొట్తి పైనవేసుకున్నట్లు
చెట్టుచెడే కాలానకు కుక్కమూతి పిందెలు
చెట్టుముందా విత్తుముందా అన్నట్లు
చెట్టులేనిచేను చుట్టములేనియూరు కష్టము
చెట్టువేసినవాడు వొకడు ఫలమనుభవించే వాడొకడు
చెట్టైవంగనిది మ్రానై వంగునా?
చెట్లుమొండయితే చేరికలో వాన
చెడి స్నేహితుని యింటికి వెళ్ళవచ్చునుగాని చెల్లెలింటికి వెళ్ళగూడరు
చెడినచేను చెరకురాజనాలు పండునా
చెడిపోయిన బ్రాహ్మణునికి చచ్చిపోయిన ఆవుదానం
చెడేవాడు అబ్బడున్నాడు మరిపిడికెడుతేరా దానం చేస్తాను
చెడ్డ కాపరానికి ముప్పేమిటి చంద్రకాంతాలు వండేపెండ్లామాఅంటే, ఐన అప్పకి అంతమేమిటి అవేవండుతానురా మగడా అన్నదిట
చెడ్డకాపరమునకు ముప్పేమిటి మొండికాలుకు చెప్పేమిటి
చెడ్డచేనుకు యింటివడ్లు పొంగలా
చెనిలోపుట్టినబీడు ఎక్కడికిపోదు
చెప్పకపోయినా పిచ్చకొమ్ములయెద్దును కొనుము
చెప్పవచ్చునుగాని రొప్పరాదు
చెప్పి తేసిగ్గు దాస్తేదు:ఖము
చెప్పినంత చేసేవారు శివునికన్న వేరేలేరు
చెప్పినబుద్దీ కట్టినబిద్దీ నిలువదు
చెప్పుడుమాటలకన్నా తప్పుడుమాటలు నయం
చెప్పులవానికి చేనంతా చెప్పులు కప్పినట్లగుపడుతుంది
చెప్పులు చిన్నవని కాళ్లు తెగగోసుకున్నట్లు
చెప్పేవాడికిసిగ్గులేకపోతే వినేవాడికి వివేకమైనావుండద్దా
చెయ్యిచూపి అవలక్షణం అనిపించుకున్నట్లు
చెరపుకురా చెడేవు పురకకురా పడేవు
చెరుకా బెల్లముపెట్టమంటే పెట్టనా
చెరుకుండేచోటికి చీమలు తామే చేరుతవి
చెరుకుతీపిఅని వేళ్ళతో తినవచ్చునా
చెరువునిండితే కప్పలు చేరుతవి
చెరువుమీద కోపంవచ్చి మడ్దికడుగమానినట్లు
చెఱకుతినడానికి కూలియివ్వవలెనా
చెలిమిని చేదు తినిపించవచ్చును గాని, బలిమిని పాలు త్రాగింపలేము
చెల్లనికాసు ఎన్నడూచెల్లదు వల్లనిమగడు ఎన్నడూవల్లడు
చెల్లీచల్లడములకు శెట్టిగారున్నారు
చెవిటిపెద్దమ్మా చాంతాడంటే చెవులపోగులు నా జన్మానా యురుగనన్నదట
చెవిటివానివద్ద శంఖమూదితే అది కొరకడానికి నీ తండ్రి తాతలతరం గాదన్నాడట
చెవుడు చెవుడూంటే తవుడుతవుడన్నాడట
చెవ్వాకుపోయునమ్మ కెంతవ్యసనమో, దొరికినమ్మకంత సంతోషం
చేతనైనమగవాడు చాలాప్రొద్ధునలేచి మూడ్చుకొని చల్లుకొని మరియొక చోట పండుకున్నాడాట
చేతిలో లేనిది చేనులో యెలాగువస్తుంది
చేతులు కాలినవెనుక ఆకులుపట్టుకున్నట్లు
చేదుతింటారా చెట్టుకొట్టుతారా
చేనిపంట కొయ్యకాలే చెవుతుంది
చేను కొడవలి నీచేతి కిచ్చినాను
చేనుకు ఘట్టు ఊరికి కట్టు వుండవలెను
చేనులో చేనుకలసినా జాగాలో జాగాకలిసినా పోనివ్వరాదు
చేలోపత్తి చేలోవుండగానె పోలికి మూడు మాళ్లు నాకు ఆరుమాళ్లు అన్నట్లు
చేసిన చేష్ట లెవరెరుగరుగాని కోసినముక్కు అందరూ చూచినారట
చేసిన పాపము చెప్పితే తీరుతుంది
చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ
చేసేది బీదకాపురం వచ్చేది రాచరోగాలు
చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటె కోపాలు
చేసేవి శివపూజలు దూరేవి దొమ్మరిగుడిసెలు
చదువనేర్చిన ఆడుదానితో వండనేర్చిన మగవారితో నోపలేరు
చిలక తనముద్దేగాని యెదటిముద్దు కోరదు
చేసిన చేష్ట లెవరెరుగరుగాని కోసినముక్కు అందరూ చూచినారట
ఛీకటి కొన్నాళ్లు వెన్నెలకొన్నాళ్లు
ఛెనుచేసి చెడలేదు చెడ్డాచేసి బ్రతకలేదు
Post a Comment