Telugu Samethalu Lettter DA(ద)
దండమయ్యా బాపనయ్యా అంటే మీతండ్రిపాత బాకీ యిచ్చి పొమ్మన్నడట
దండుగకు రూపాయలు తద్దినానికి కూరలు పోగుకాకుండా పోవు
దండులోకి పోతే రెంటిలొ ఒకటి
దంపినమ్మకు బొక్కినదే కూడు
దక్షించిన వాణ్ణి భక్షించనా
దగ్గితే నిలవనిమొక్క తుమ్మితే నిలచునా
దగ్గిరకు పిలిచి దాసరీ నీకన్నులొట్టా
దత్తతమీద ప్రేమా దాయాదిమీద ప్రేమా
దమ్మిడీ గుర్రం దుమ్ము రేపినట్లు
దమ్మిడీ గుర్రం దుమ్ము రేపినట్లు
దయగల మొగుడు దండుకుపోతూ రోలుతీసి రొమ్మున వ్రేలవేసి పోయినట్లు
దయతో దండాలుపెట్టితే పడవేసి బందాలు పెట్టినట్లు
దయదగ్రుమంటే నెత్తి చుర్రుమంటుంది
దయలేనత్తకు దండం పెట్టినా తప్పే
దయ్యపు కంటికి పేలగింజ వెంగెము
దయ్యము కొట్టనూ బిడ్డ బ్రతకనూనా
దయ్యాల ముండగ బిడ్డ బ్రతుకుతుందా
దరిద్రుడు తల కడలోతే వడగండ్ల వాన వెంబడే వచ్చినదట
దరిద్రుని సంగీతానికి భూమ్యాకాశాలే తాళపుచిప్పలు
దశా దసా రావే అంటే దరిద్రాన్ని పిలు అన్నదట
దాగబోయి తలారి యింట్లో దూరినాడట
దాగబోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్లు
దాన్యమైతే యివ్వలేను దండుగైతే పెట్టగలను
దాయకట్టు యావు పొడవక మానునా
దారినపొయ్యే వ్యాజ్యం కొనితెచ్చుకున్నట్లు
దాష్టీకానికి ధర్మంలేదు, గుడ్డికంటికి చూపులేదు
దాసరిపాట్లు పెరుమాళ్ళ కెరుక
దాసరివా జంగమవా అంటే ముందరివూరుకొద్దీ అన్నట్లు
దాసరివా జంగమవా అంటే ముందరివూరుకొద్దీ అన్నట్లు
దిక్కులేనివారికి దేముడే దిక్కు
దిన దిన గండము వెయ్యేళ్ళు ఆయుస్సు
దినము మంచిదని తెల్లవార్లు దొంగిలించినట్లు
దిసమొల వాడా కాళ్ళకట్టువానికి కప్పమన్నట్లు
దిసెనెమొలవాది దగ్గ్తరికి దిగంబరుడు వచ్చి బట్ట అడిగి నట్లు
దీపంపేరుచెప్పిన చీకటిపోవునా
దీపంవుండగానే చక్కబెట్టుకో
దీపముండగా నిప్పుకు దేవులాడనెల
దీపాన వెలిగించినది దివిటీ
దీపావళివర్షాలు ద్వీపాంతరం దాటును
దుక్కికొద్దీ పంట బుద్ధికొద్దీ సుఖము
దుక్కిగల భూమికి దిక్కుగల మనుజుడు చెడడు
దుక్కిచలవవేచలవ తల్లి పాలేపాలు
దుక్కిటెద్దు దేశాంతరం వెళ్లినట్లు
దుక్కిదున్నితే భూమికి శాంతము
దుక్కివుంటే దిక్కువుంటుంది
దున్నక చల్లితే కొయ్య పండింది
దున్నక వేసిన ఆముదాలు మాదిగకు యిచ్చిన అప్పు తిరిగిరావు
దున్నగలిగితే మన్నుముట్టవలెను
దున్నపోతు యీనిందంటే చెంబు తేరా పాలు పితుక్కుందాం అన్నట్లు
దున్నపోతు యీనిందంటే తూడను కట్తివెయ మన్నట్లు
దున్నపోతుపై వర్షము కురిసినట్లు
దున్నబోతే దూడల్లో, మెయ్యబోతే ఆవుల్లో
దున్నలా కష్టపడి దొరలా తినవలెను
దున్నినపొలానకూ తాగిన గంజికి సరి
దున్నేరోజులలో దేశంమీదపోయి కోతరోజులలో కొడవలి పట్టుకొచ్చినట్లు
దున్నేవాడు లెక్కచూస్తే నాగలికూడా మిగలదు
దున్నేవాళ్ళకు వేళచూపినట్లు
దుబ్బుకాగెడు వెన్ను మూరెడు, దూసితే దోసెడు, వూదితే యేమీలేదు
దుమ్ముపోసి అంబలి కాచినట్లు
దుర్మార్గమునకు తండ్రి బద్ధకము
దుష్టునికి దూరముగా వుండవలను
దూడ కిడిచినట్లా దుత్తలలో పడ్డట్లా
దూడ బర్రెవుండగా గుంజ అరజినట్లు
దూడకుడిస్తే గాని ఆవు చేపదు
దూడచస్తే కమ్మలం (దూడ లేని పశువుపాలు) గేదెచస్తే నిమ్మళం
దూబరతిండికి తూమెడు, మానవతికి మానెడు
దెబ్బకు దెయ్యంసహా హడలుతుంది
దేవుడి పెండ్లికి అందరు పెద్దలే
దేవుడిచ్చునేగాని తినిపించునా
దేవుడితోడు నామీద దయవుంచు
దేవుడిస్తాడుగాని వండివార్చి వాతబెట్టునా
దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడు
దొంగ చిక్కెనోయీ అంటే కరిచేవోయి అన్నట్లు
దొంగ చెయ్యి దాచిపెట్టినా అమావాస్యనాడు అల్లల్లాడుతుంది
దొంగ వాకిట మంచం వేసినట్లు
దొంగకు తలుపుతీసి దొరను లేపినాడు
దొంగకు దొంగబుద్ధి దొరకు దొరబుద్ది
దొంగగొడ్లకు గుది కర్రవేసినట్లు
దొంగతోకూడా దయ్యం వెంబడె వచ్చును
దొంగను పుట్టించినవాడు మతిభ్రష్టును పుట్టించక మానడు
దొంగలబడ్డ ఆరుమాసములకు కుక్కలు మొరిగినవి
దొంగలుతోలిన గొడ్దు యే రేవున దాటినా ఒకటే
దొంగలుతోలిన గొడ్దు యే రేవున దాటినా ఒకటే
దొంగవాడి పెండ్లాము యెప్పుడు ముండమోపే
దొంగిలబోతే మంగలం దొరకినట్లు
దొంగీలించేటంత దొరతనం వుండగా అడిగేటంత అన్యాయానికి పాలుపడతానా
దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకొనిపోతే గొడ్దుగేదె శ్రామహాలక్ష్మి అయినదట
దొరను పేదనరాదు యెద్దును సాధనరాదు
దొరలుయిచ్చిన పాలుకన్నా ధరణియిచ్చిన పాలుమేలు
దొరికిన సొమ్ముకు దొంగ అవుతాడా
దోమలు పండితే చామలు పండును
దోమలేకుండా చొడియగట్టి ఒంటెను మ్రింగువారు
దోవలో కూర్చుండి దొబ్బులు తిన్నట్లు
ద్రావిడానాం ఘృతంనాస్తి మిళ్లే మిళ్లె నిరంతరం
ద్వారపూడి పచ్చవువాని యెత్తు
దయగల మొగుడు దండుకుపోతూ రోలుతీసి రొమ్మున వ్రేలవేసి పోయినట్లు
దాసీకొడుకైనా కాసుగలవాడు రాజు
దుబ్బుకాగెడు వెన్ను మూరెడు, దూసితే దోసెడు, వూదితే యేమీలేదు
దేవుడి పెండ్లికి అందరు పెద్దలే
దొంగవస్తానని ముందు చెప్పివుంటే సాక్షులనైనా సంపాదించు కుందును
ధనము దాచినవానికే తెలియును లెక్కవ్రాసినవానికే తెలియును
ధనవంతుడు భక్తిపరుడైతే సూదిబెజ్జములో ఒంటె దూరిందన్నమాట
ధర్మంచేసేవాడు తన్ను మరుస్తాడా
ధర్మపురిలో దొంగిలించబోతూ ధార్వాడనుంచి వంగుని పోయినట్లు
ధర్మానికి దండుగలేదు వెట్టికి పైసలేదు
ధాష్టీకానికి ధర్మమూలేదు గుడ్దికంటికి చూపూలేదు
ధీరుడైనా కావలె దీనుడైనా కావలె
ధైర్యములేనిరాజు యోచనలేనిమంత్రి
Post a Comment