Telugu Samethalu Lettter E(ఎ)
ఎంగిలిచేత్తో కాకి కైనావిదపడు
ఎంచబోతే మంచమంతా కంతలే
ఎంచి చేస్తే ఆరి తరుగునా
ఎండబెడితే వుండవుతుంది వుండబడితే వండబడుతుంది వండబడితే తిండబడుతుంది తిందబడితే పండబడుతుంది పండబడితే చీకటిపడుతుంది
ఎండుమామిడి టెంకలు ఓడిలోపెట్టుకొని అవరితాడు తెంపటానికి వచ్చినావోయి వీరన్నాఅన్నాడట
ఎంత చెట్టు కంతగాలి
ఎంత పొద్దు ఉండగా లేచినా తుమ్మకుంటవద్దనే తల్లవ్చారింది
ఎంతదయో నరకడికి చేంత్రాడు వెదుకుతున్నాడు
ఎంతమంచి నందిఐనా అమేధ్యం తినకమానదు
ఎంతమంచి నందిఐనా అమేధ్యం తినకమానదు
ఎంతమంచిగొల్లకైనా ఇప్పకాయంత వెర్రివుంటుంది
ఎక్కడకట్టితేనేమి మనమందలో యీని తేసరి
ఎక్కడకొట్తినా కుక్కకు కాలుకుంటు
ఎక్కడనైనా బావా అనవచ్చును గాని వంగతోటదగ్గిర బావా అనకూడరు
ఎక్కడున్నవే కంబళీఅంటే వేసినచోటనేవున్న వెంబళీ అన్నదట
ఎక్కినవానికి ఏనుగులొజ్జు
ఎక్కిపోయి పట్టిచూచి దిగివచ్చి రాళ్ళురువ్వినాడట
ఎక్కిరించబోయి వెలకిలబడ్డాడట
ఎక్కూఅంటే ఎద్దుకుకోపం దిగూ అంటే కుంటివానికికోపం
ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య
ఎగరబోవుచు బోర్లబడి యీవురు అచ్చిరాదన్నాడట్టు
ఎచ్చులకు ఏలూరుపోతే తన్ని తలగుడ్డలాకున్నారట
ఎత్తుకతిన్న వాణ్ణీ పొత్తులో పెట్టుముంటే అంతాతీసిబొంతలో పెట్టుకొనెనట
ఎత్తుకొని తిన్నబోలె ఎదురుగావస్తే సంకనున్నజోలే సలాంచేసిందట
ఎత్తుపడ్డ గొడ్డు పులికి జడుస్తుంది
ఎదటపొయ్యిమండితే తనపొయ్యిలోనీళ్ళు పోసుకున్నట్లు
ఎదటవున్నవాడు పెళ్లికొడుకు
ఎదుగువడ్డమ్మ ఎండిపోయినదట
ఎద్దు దున్నగా పిణుజు లొగిరించినదట
ఎద్దు నడిగా గంతకట్టటం
ఎద్దుఈనెనంటే కొట్టానగట్టమన్నట్టు
ఎద్దుతన్నునని భయపడి గుఱ్ఱముచాటున దాగినాడట
ఎద్దును కొద్దిలో కొనరాదు బట్టలు బారిలో కొనరాదు
ఎద్దునుజూస్తే ముద్దేగాని దున్నబోతే దు:ఖమువస్తుంది
ఎద్దునెక్కినవాడే లింగడు గద్దెనెక్కినవాడే రంగడు
ఎద్దున్నవానికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నవానికి ఎద్దుండదు
ఎద్దుపుండు కాకికిమొద్దా
ఎద్దుమోసినంత గోనెపట్టినంత
ఎద్దుయెండకులాగ దున్ననీడకులాగ
ఎద్దులవెంబడే తాళ్ళు
ఎద్దులాగున్నావు తేలుమంత్రంరాదా
ఎద్దులుబండియు నేకమై కొండమీదికిపోవును
ఎద్దులేని సేద్యము చద్దిలేని పైనము
ఎద్దువలెతిని మొద్దువలె నిద్రపోతాడు
ఎద్దేమి యెదుగురా అటుకులరుచి గాడ్దేమిఎరుగురా గంధపు వాసన
ఎనుబోతుమీద వానకురిసినట్లు
ఎనుము తన్నునని గుఱ్ఱమువెనుక దాగినట్లు
ఎనుము యీనినది రెడ్డీఅంటే నీకేమికద్దేబొడ్డీఅన్నట్లు
ఎన్నడుఎరగనిరెడ్డి గుఱ్ఱముఎక్కితే వెనుకముందాయెను
ఎన్నిబూతులైనా పిదికెడు కొర్రలుకావు
ఎప్పటి అమ్మకు నిప్పటేగతి
ఎముక లేనినాలుక ఎటుతిప్పినా తిరుగుతుంది
ఎరగనివూళ్లో యెమ్మెలుచేస్తే యేకులు నీ మొగుడు వడుకుతాడా
ఎరుకపెడికెడు ధనం
ఎరుకసత్యముకాదు వాక్కుతోడుకాదు
ఎరువులసొమ్ము యెరువులవారు ఎత్తుకపోతే పెండ్లికొడుకు ముఖాన పేడానీళ్ళు చల్లినట్టేవుంటుంది
ఎరువులసొమ్ముబరువులచేటు తియ్యాపెట్టా తీపులచేటు అందులో ఒకటిపోతే అప్పులచేటు
ఎఱ్ఱను చూపి చేపను పట్టినట్లు
ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి తనపట్టు వదలదు
ఎలుక యేట్లోపోతేనేమి పిల్లి బోనులోపోతేనేమి
ఎలుకకు పిల్లి పొంచువేసినట్లు
ఎలుకకు పిల్లి సాక్ష్యము
ఎలుకచావుకు పిల్లి మూర్చపోవునా
ఎలుకమీద కోపాన యిల్లు చిచ్చుబెట్టుకున్నట్లు
ఎలుగుబంటికి దంతము తీసినట్లు
ఎల్లవార లమ్మల బ్రతుకు తెల్లవారితే తెలుస్తుంది
ఎల్లిశెట్టి ఎక్కయే లెక్క
ఎవరబ్బ సొమ్మురా యెక్కియెక్కి ఏడ్చెవు
ఎవరి పైగుడ్డ వారికి బరువా!
ఎవరికి వారే యమునాతీరే
ఎవరికొంప తీయడానకు యీ జంగం వేషం వేసినావు
ఎవరిజానతో వారు యెనిమిది జానలే
ఎవరినీళ్ళలో వారే మునుగవలెను
ఎవరిపుండు వారికి నొప్పి
ఎవరిప్రాణము వారికి తీపు
ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే నోటివల్ల చెడ్డా నోయి తోటమరాజా అన్నాడట
ఎవరు ఏమిచేసినా యింటికి ఆలూవుతుందా దొంతికి కడవ అవుతుందా
ఎవరుయిచ్చినది యీ మావూఅంటే నేనే యిచ్చుకొన్నాను అన్నాడట
ఎందుకుఏడుస్తావురా పిల్లవాడా అంటే ఎల్లుండి మావాళ్ళు కొట్తుతారు అన్నాడట
ఎదట అన్నదిమాట యెదాన పెట్టింది రాత
ఎన్నో వ్రణములుకోసినాను గాని నావ్రణంత తీపులేదు
ఎవరికిపుట్టిన బిడ్డవురా యెక్కియెక్కి ఏడ్చేవు
Post a Comment