Telugu Samethalu Lettter EE(ఈ)
ఈ అంబటి కేనా యిరవైనాలుగు నామాలు
ఈ కంటికే రప్పలు దూరనా
ఈ నేల వడ్డీ వచ్చేనెల మొదలూలేదు
ఈగకు యిలి పాముకు బలిపుట్టదు
ఈచేతచేసి ఆచేత అనుభవించినట్లు
ఈడ్చుకాళ్ళవానికి యిద్దరు భార్యలు ఒకతె యీడువ, ఒకతె ఏడువ
ఈతకు మించిన లోతులేదు, గోచీకి మించిన దరిద్రము లేదు
ఈతక్రింద పాలు త్రాగినా కల్లే అంటారు
ఈతగింజ యిచ్చి తాటిగింజ లాగేవారు.
ఈతముల్లు విరగదొక్కే కాలము
ఈదబోతే తాగనీళ్ళు లేవు
ఈదాడన్న గోదాడన్నట్లు
ఈదుతీస్తే పేమువచ్చినట్లు
ఈదులకు పోయినవాడు యిల్లుకాలినా రాడు తాళ్ళలోకి పోయినవాడు తండ్రిచచ్చినా రాడు
ఈనగాగాచి నక్కలపాలు
ఈపిల్లి ఆ పాలు తాగరు
ఈయని మొండికి విడువని చెండి
ఈవూరికి ఆవూరెంతో ఆవూరికి యీవూరూ అంతే
ఈవూళ్ళో పెద్దలు ఎవరంటే తాళ్ళు, దాతలు ఎవరంటే చాకళ్ళు
Post a Comment