Telugu Samethalu Lettter GA(గ)
గంగలో మునిగినా కాకి హంసౌతుందా?
గంగాధరుడు చచ్చినాడు అమ్మా
గంధము అమ్మినచొట కట్టెలు అమ్ముట
గచ్చపొదమీద యిసుక వేసి కయ్యానికి రమ్మన్నట్లు
గట్టివాడేగాని కడుపుమాత్రము గుల్ల
గట్టివిడిచి పొట్తుకు పోరాడినట్లు
గట్తుచేరిన వెనుక పుట్టివానితో పోరాడినట్లు
గడిచిబ్రతికినానని గంతులువేయరాదు
గడియపురసత్తులేదు గవ్వరాకడలేదు
గడ్డంకాలి ఒకడు యేడేస్తుంటే చుట్టకు నిప్పుయిమ్మని ఒకడు వెంటబడినట్లు
గడ్డతిన్నా కంపే పాయతిన్నా కంపే
గడ్డపలుగుమింగి శొంఠికషాయము త్రాగినట్లు
గడ్డపారలు గాలికి కొట్టుకపోటుంటే పుల్లాకునాపని యేమిటి అన్నదట
గడ్డింతలేక ముడ్డంత యెండి వేంచేసెనే గుర్రము దేవలోకం
గతకాలము మేలు వచ్చుకాలముకంటె
గతిలేనిఅమ్మకు మతిలేనిమగడు
గతిలేనివాడు గాడిదకాళ్ళు పట్టుతుకున్నట్లు
గతుకులకు పోతే బతుకులు పోయినవి
గబ్బిలము ఆకాశం పడకుండా పట్టుకుంటానన్నదట
గయ్యాళి రచ్చకెక్కితే సంసారి పోయి దొంతులసందున దాగినట్లు
గరుడాయిలెస్సా అంటే శేషాయలెస్స అన్నట్లు
గరుత్మంతుణ్ణి చూచిన పామువలె
గాండ్లవాని ఆశ గోతమైనా పట్టదు
గాజుపూసల గనిలో ఘనమైన మణి దొరకునా
గాజులగుదికి రోకలి పూసినట్లు
గాడిద గంపెడు వూక తిన్నది అన్నట్లు
గాడిద గాడిదే గుర్రము గుర్రమే
గాడుపుకు గడ్డపార కొట్టుకుపోతే ఉల్లిగడ్డపొర నాగతేమి అన్నదట
గాదె కింద యెలుక గాదె క్రిందనే బ్రతుకవలెను
గాదెనిండా బియ్యంవుంటే కరువు కాలాన నా భార్యాను పిల్లలను రక్షిస్తానన్నట్లు
గానుగరోట్లో చెయ్యిపెట్టి పెరుమాళ్లు నీకృప అన్నట్లు
గానుగాపె గానుగాపె నీవు గూర్చున్న పనేగదా నూనె పొయ్యడం
గారాబం గారెలు కేదిస్తే వీపు దెబ్బల కేడ్చినట్లు
గారాబాల బిడ్డ పుట్టితే గడ్డపారతో చెవులు కుట్టినట్లు
గాలికి పుట్టి ధూళికి పెరిగి నట్లు
గాలికి పోయిన పేలపిండి భగవంతుని కర్పణము
గాలిలో దీపం పెట్టి దేవుడా నీమహిమ చూపు అన్నట్లు
గాలివచ్చి నప్పుడుగదా తూర్పార పట్టవలెను
గాలీవాన వస్తే కధే మానుతుంది
గింజలు ముత్తుము పిట్టలు పన్నిద్ధుము
గుండ్రాయి దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా
గుండ్లుతేలి చెండ్లు మునిగినట్లు
గుడి మింగేవానికి గుళ్లోలింగమెంత?
గుడి మింగేవానికి దలుపు లప్పడములు
గుడిపాము కరచినట్లు గంగిగొవు పొడిచినట్లు
గుడిమిం గేవానికి గుళ్లోలింగము వట్రవడియము
గుడిలో గంటపోతే నంబి శఠమైనా వూడదు
గుడ్డిపాము కరచినట్లు గంగిగొవు పొడిచినట్లు
గుడ్డివాడు కన్ను రాగొరునా పోగోరునా
గుడ్డువచ్చి పిల్లను వెక్కిరించినదట
గుడ్దికన్ను తెరచినా ఒకటే మూసినాఒకటే
గుడ్దిగుర్రాలకు పండ్లు తోముచున్నాడు
గుడ్దినక్క పూరిన పడ్డట్టు
గుడ్దినక్క పూరిన పడ్డట్టు
గుడ్దిమామగారా నమస్కారమయ్యా అంటే రంధికి మూలమా రంకుల కోడలా అన్నాడట
గుడ్దియెద్దు చేలోపడ్డట్టు
గుడ్దివాడికి గుడ్దివాడు దారిచూపితే ఇద్దరు గోతిలో పడతారు
గుణము మానవే గుంటాలపోలీఅంటే నామనుమైనా మానుతానుగాని గుణము మాననందట
గుద్దులాడేయింట్లో గుప్పెడుగింజలు నిలువవు
గుమ్మడికాయలు దొంగాంటే బుజాలు తడిమిచూచుకొన్నట్లు
గుమ్మడికాయలు పోయేదారి యెరుగడుగాని ఆవగింజలు పోయేదారి అట్టే కనిపెట్టుతాడు
గుమ్మడిపండు వాటంగా బట్టయెగదోసి
గుమ్మళ్ళు కుళ్ళీనవి ఆవలు అల్లినవి
గురికి జానెడెచ్చు తక్కువగా కాల్చేవాడు
గురువింద తన యెరుపేగాని నలుపెరుగదు
గురువు నిలుచుండి తాగితే శిష్యుడు పరుగెత్తుతూ తాగుతాడు
గురువుకు పంగనామాలు పెట్టితినట్లు
గుఱ్ఱం గుడ్దిదైనా దాణాతప్పదు
గుఱ్ఱం చచ్చిందికాక గుంటత్రవ్వుటకు నొకరూక
గుఱ్ఱం పేరు గోడ అయితే జీనుపేరు!మదురు. యింక అంతా తెలుసును
గుఱ్ఱం వలె కుక్కనుపెంచి రెడ్డి తానే మొరిగెనట
గుఱ్ఱపుతోకకు కళ్లెంపెట్టినట్లు
గుఱ్ఱపుబండికి వొంటెద్దులబండి ఆదర్శంగా
గుఱ్ఱమును తిన్నకుక్క అదేమి బ్రతుకును
గుఱ్ఱానికి కడుపు మాడితే ఆరిక కసరైనా తింటుంది
గుఱ్ఱానికి గుగ్గిళ్ళు తినవేర్పవలెనా
గుఱ్ఱానికీ తోకవుంటే అదే విసురుకుంటుంది కాని సావిట్లో గుఱ్ఱాలన్నింటికీ విసుతుందా?
గుళ్లుమింగేవానికి గుడిలింగాలు లక్ష్యమా
గుళ్లోదేముడికి వైద్యంలేకుంటే బూజారి పులిహోరకు యేడ్చినాడట
గువ్వగూడెక్కె అవ్వమంచమెక్కె
గూట్లోదీపం కుక్షి లో ముద్ద
గూనివాడు పడుకునేవీలు గూనివాడికే తెలుసు
గృహప్రవేశానికి వెళ్లుతూ గుడ్లగూబను తోడుతీసుక పోయినట్లు
గొంతుకోసేవాదు కత్తియేమరునా
గొడారివానివద్ద తోలుకొన్నట్లు
గొడ్డుపోతును బిడ్డను కనమంటే కంటుందా
గొడ్డుపోతేమొరుగురా బిడ్డచలి
గొడ్దువాడు గొడ్దుకేడిస్తే గొడారివాడు తోలు కేడ్చినట్లు
గొడ్లగాచేవానిని కొట్టనివాడు గొర్రెలకాచేవాణ్ణి తిట్టనివాడులేదు
గొద్రాలి కేమి తెలుసు బిడ్డనొప్పులు
గొర్రె కొవ్వితే గొల్లకే లాభం
గొర్రె కొవ్వితే గొల్లకే లాభం
గొర్రె కోసేవాణ్ణిగాని నమ్మదు
గొర్రె యేడిస్తే తోడేలుకు విచారమా
గొర్రెను తినేవాడుపోతే బర్రెను తినేవాడు వచ్చును
గొర్రెలలో తోడేలూచొరబడ్డట్టు
గొల్లవాని కొమ్ము హెచ్చనుహెచ్చదు, తగ్గను తగ్గదు
గొల్లవారింటి పెండ్లి తెల్లవారింది
గోంగూరలో చింతకాయ వేసినట్లు
గోచిపాతరాయడు దొంగల మిండడు
గోటమీటితే పోయేపనికి గొడ్డలి యెందుకు
గోడకుపెట్టినసున్నం లంజకుపెట్టిన సొమ్ము
గోడమీది సున్నము విడియము లోనికి వచ్చునా
గోడవుంటే చిత్రం వ్రాయవచ్చు
గోరంత వుంటే కొండంత చేస్తాడు
గోరువాస్తే వేలంత, వేలువాస్తే కాలంత కాలువాస్తే రోలంత, రోలువాస్తే యెంత
గోవులను కోసి చెప్పులు దానము చేసినట్లు
గోవులేనివూళ్ళో గొడ్దనేది శ్రీమహాలక్ష్మి
గురువుమాట మీరరాదు గడ్డపారమింగరాదు
Post a Comment