Telugu Samethalu Lettter I(ఇ)
ఇంగువ కట్టినగుడ్డ
ఇంటింటికీ ఒక మట్టిపొయ్యి అయితే మాయింటికి మరి ఒకటి
ఇంటికన్నా గుడి పదిలం
ఇంటికి జ్యేష్ఠాదేవి పొరుక్కు శ్రీమహాలక్ష్మి
ఇంటికి లక్ష్మిని, వాకిలికి చెప్పును
ఇంటిగుట్టు లంకకు చేటు
ఇంటిచక్కదనం యిల్లాలు చెప్పును
ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే మూతిమీసాలన్నీ తెగ కాలినవట
ఇంటిదేవర యీగిచస్తే పొలందేవర గంపజాతర అడిగిందట
ఇంటిదోంగను యీశ్వరుడు పట్టలేదు
ఇంటినిండా కోళ్ళు ఉన్నవి గాని కూ శేటందుకు లేవు (ఒక్కటిలేదు)
ఇంటినిండా కోళ్ళు ఉన్నవి గాని కూ శేటందుకు లేవు (ఒక్కటిలేదు)
ఇంటినుండి వెడలగొట్టగా దొందులు సవరించెనట
ఇంటిపిల్లికి పొరుగింటి పిల్లితోడు.
ఇంటిపేరు కస్తూరివారు ఇల్లు గబ్బిలాలవసన
ఇంటిమీద రాయివేసి వీవు వొగ్గేవాడు
ఇంటిలో పాయసమున్నూ మందలో పాలుకూడానా?
ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కర్రయిచ్చినట్లు
ఇంటివాణ్ణిచేసి గొంగ చేతికి కర్రయిచ్చినట్లు
ఇంటివారు వేలుచూపితే బైటవారు కాలు చూపుతారు
ఇంటివెనకాలకు వెళ్ళీ యిల్లుముందుకు తెచ్చినట్లు
ఇంటిసొమ్ము ఇప్పపిండి పొరుగుసొమ్ము పొడిబెల్లము
ఇంట్లో ఇల్లాలే లేదంటే పెండ్లామా అని పిలిచాడాట
ఇంట్లో ఈగ పులి బైటపెద్దపులి
ఇంట్లో ఈగలమోత బైట సవారీలమోత
ఇంట్లో పస్తు బైటదస్తు
ఇంట్లో పెండ్లి అయితే వూళ్ళో కుక్కలకు హడావిడి
ఇంట్లోలింగాకారం, దోవలోచక్రాకారం, యిక్కడ జడలాకారం, యెక్కడా అన్నాకారంలేదు అన్నాడట.
ఇంతమందిదొరలూ 'చావకపోతే నేనుమాత్రం చస్తానా నాక అక్కరలేదు
ఇక్కడ అక్కడవుంటే యీడేరిపొతావు నాయింటికి రావే నవిశిపోదువుగాని
ఇచ్చకాలము బుచ్చకాలవారు పొట్టకొరకు పొక్కులు గోకుతాడు.
ఇచ్చినవాడుదాత యివ్వనివాడునాత
ఇచ్చినవాడే నొచ్చినవాడు చచ్చినవాడే అచ్చినవాడు
ఇచ్చిపుచ్చుకొని మొగుడివీపెల్లా తడిమినట్లు
ఇచ్చివచ్చే నిష్ఠు రముకన్నా యివ్వకవచ్చే నిష్టురంనయం
ఇచ్చుడువాడూకాదు, చచ్చుడువాడూకాదు పూట పూటకు కూటికి వచ్చుడుగాడు
ఇచ్చుర్ల పసుపు వేసుకొంటే వికారము ముసలివానిని చేసుకొంటే వొకారము
ఇచ్చేటప్పుడు కాముని పండుగ పుచ్చుకొనేటప్పుడు దీపావళి పండుగ
ఇచ్చేవాణ్ణి చూస్తే చచ్చేవాడైనా లేచును
ఇచ్చేవానికి వత్రము రద్దు చచ్చేవానికి మందూవద్దు
ఇటుకులాడికి రవిక పెడితే కంపకుపెట్టి చింపుకొన్నదట
ఇత్యర్ధులు ఇగురు ఇతిభావాలు పులుసు
ఇత్యవులు కూయగా కొనంగుడేయగా అప్యేకదంతుడు పున్నపుంసకమెక్కి ఆడానమ్మా
ఇది చలమో ఫలమో!
ఇదిగోపులి అంటే అదిగో తోకాన్నట్లు
ఇనప గుగ్గిళ్ళుగాని మినప గుగ్గిళ్ళు కావు
ఇనుము కరిగినచోట ఈగల కేమున్నది
ఇనుము విరిగితే అతకవచ్చునుగాని మనసువిరిగితే అతకరాదు
ఇనుముతీట పేముపట్టిన చెయ్యి వూరకుండవు
ఇనుమునిగూర్చి అగ్నికి సమ్మెటపెట్లు
ఇన్నాళ్లు బ్రతికి యింటివెనక చచ్చినట్లు
ఇన్నీ ఇన్నీ తిన్నమ్మ యిల్లు నాశనం ఛేసెనట
ఇరిగిపోయిన చెంఫలకు యిప్పనూనెపెట్టితే సాని దాని ముఖము నిగనిగలాడిందట
ఇరుగింటమ్మా పొరుగింటమ్మా మాయింటాయన గోడు చూడు
ఇరుపోటీల యిల్లు చెడును, వాత నొప్పుల వొళ్ళు చెడును
ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరు బండియైన బారదు
ఇలిటవువాడు యింటికిచేటు కొమ్ముఒలబర్రేకొట్టానికి చేటు
ఇల్లలుకగానే పండుగ అవుతుందా
ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు
ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం
ఇల్లు కట్టిచూడు పెళ్ళి చేసిచూడు
ఇల్లు కాలబెట్తి జల్లెడతో నీళ్లు పోసినట్లు
ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ఒళ్ళుకాలి ఓకడేడ్చినట్లు
ఇల్లు గాలుచుండగా వాసాలు దూసుకున్నట్లు
ఇల్లు గెలువలేనివాడు రచ్చ గెలుచుగా
ఇల్లు చొరబడి యింటి వాసాలు లెక్కపెట్టినట్లు
ఇల్లు తిరిగిరమ్మంటే యిలారం తిరిగివచ్చినట్లు
ఇల్లు మింగే అత్తగారికి యుగంమింగే కోడలు
ఇల్లు వడలగొట్టగా విడుపులశృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తలశృంగారం
ఇల్లు వెడలిపోరా నంబీఅంటే నామాన్యం ఎక్కడ అన్నాట్ట
ఇల్లుకాలింది జగమయ్యా అంటే నాజోలె కప్పరా నాదగ్గరున్నది అన్నాట్ట
ఇల్లుకాలినా యిల్లాలు చచ్చినా గొల్లుమానదు
ఇల్లుయేడ్చే అమావాస్య, యిరుగూపొరుగూ యేడ్చే తద్ధినం, వూరుఏడ్చే పెండ్లి రేపు
ఇల్లువిప్పి పందిరి వేసినట్లు.
ఇల్లెక్కి కొరవితిప్పినట్లు.
ఇల్లెల్లాకొట్టితే తట్టెడు పెంకులు లేవు.
ఇల్లేతీర్ధం, వాకిలేవారణాసి, కడుపే కైలాసం.
ఇళ్ళంతా తడిసినవెనుక వోపలేనివానికైనా చలిలేదు
ఇవతలచేర, అవతలసార, నడుమరామరాజ్యం
ఇవ్వని మొండికి విడువనిచెండి
ఇషుంటారమ్మంటే యిల్లంతా చేసుకున్నట్లు.
ఇసుక తక్కిడి పేడతక్కిడి
ఇస్తేచెడేదిలేదు చస్తేవచ్చేదిలేదు.
ఇస్తేపెండ్లి ఇవ్వకపోతే పెటాకులు
ఇస్తేవాయనం పుచ్చుకుంటే వాయనం
ఇప్ప పూవులకు వాసన వెతకవలెను
Post a Comment