Telugu Samethalu Lettter KA(క)
కంకణాల చెయ్యి ఆడితే కడియాల చెయ్యి ఆడుతుంది
కంచం అమ్మి మట్టెలు కొన్నట్లు
కంచి అంత కాపురం గడ్డలు చేసినట్లు
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
కంటికి ఇంపైతే కడుపుకు యింపు
కంటికి కన్నూ పంటికిపల్లు
కంటికి తగిలేపుల్ల కనిపెట్టవద్దా
కంటికీరెప్ప కాలికి చెప్పు
కంఠగత ప్రాణం
కండ్లకు గంతకట్టి అడవిలో వదలినట్లు
కండ్లకు దూరమైతే చెవులకు దూరమా?
కండ్లు చెరిపిన దేముడు మతియిచ్చినట్లు
కండ్లు పోగొట్టిన దేముడు యిండ్లుచూపడా
కండ్లు పోయినంత కాటుక
కండ్లుపోయిన తరువాత సూర్యనమస్కారములు
కండ్లువుండగానే కాటుక
కందకు చేమకులేని దురద తోటకూరకా
కందకు లేనిదురద బచ్చలికేమి
కందూలేదు గుండూలేదు తుపాకిబెట్తికాల్చు
కంబళిలో తింటూ రోమములు లెక్కించినట్లు
కంసాలిమాయ కంసాలికిగాని తెలియదు
కంసాలివద్ద వుండవలె కుంపట్లో వుండవలె
కక్కిన కుక్కవద్దకు కనిన కుక్కవద్దకు కానివాణ్ణికూడా పంపకూడదు.
కక్కినకూడు
కక్కుశ్య పచ్చిగోడశ్య దాటితే మళ్ళిదాటితే రెడ్డిశ్య రెడ్దిసానిశ్య సహమూలా వినశ్యతి
కట్టినవానికి ఒకయిల్లు అయితే కట్టనివానికె వేయిండ్లు
కట్టుకున్న ఆపె పెట్టుకున్న ఆపె వుండగా యెదురు వచ్చిన ఆపె యెండి పోయినదట
కట్టె పుచ్చిన చెడును మనుష్యుడు రంజిన చెడును
కట్టెయస్వాహా, కంపాయస్వాహా; నీకునాకు చెరిసగాయస్వాహా
కట్టెలేదు పుడకాలేదు కాచిపొయ్య నీళ్ళూలెవు పదవోయి అల్లుడా బావిగట్టుకు
కట్టెవంక పొయ్యి తీరుస్తుంది
కట్తిన యింటికి పణుకులు చెప్పేవారు వేయిమంది
కట్తిన వారొకరు కాపురంవుండేవా రొకరు
కడకాబోయే శనైశ్చరుండా మా యింటిదాకా వచ్చి పొమ్మన్నట్లు
కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటకు లోకువ
కడి అంటే నోరుతెరచి కళ్ళెము అంటే నోరుమూసినట్లు
కడి గండము గాచును
కడుపు కూటికి యేదిస్తే కొప్పు పూలకు ఏద్చిందట
కడుపు నిండిన బేరము
కడుపు నిండిన వానికి గారెలు చేదు
కడుపు లోని మాటంటే వూరంతా అవుతుంది
కడుపుతో వున్నమ్మ కనకమానునా, వండినమ్మ తినక మానునా
కడుపునిండా గారలు తింటే వొంటి నిండ జ్వరము
కడుపులోని బిడ్డ కడుపులో వుండగా కొడుకుపేరు సోమలింగం
కడుపులోలేనిది కావిలించుకుంటే వస్తుందా
కడుపువస్తే కనే తీరవలెను
కతలమారి మొగుడు కమ్మలు చేయిస్తే, అప్పుల కూటిమొగుడు అమ్ముక తిన్నాడట
కతికెతే అతకదు
కత్తి తీసి కంపలో వేసి యేకుతీసి పొడుచుకుంటా నన్నట్లు
కత్తి మేత్తన అత్త మంచి లేదు
కత్తి వాడియా కలంవాడియా
కత్తిపోటు తప్పినా కలంఫోటు తప్పదు
కత్తెరపోటుకు కదల పారుతుంది
కద్దు అనడానికి లేదు, అనడానకు దీనికే అధికారమా
కధకు కాళ్లులెవు ముంతకు చెవులు లేవు
కననిది బిడ్డకారు, కట్టనిది బట్టకాదు
కని గృడ్డి, విని చెవిటి
కనుక్కొని రారా అంటే కాల్చివచ్చేవాడు
కన్నతల్లికైనా కనుమరుగుండవలె
కన్నతల్లిని కాళ్ళుపట్టియీడ్చి పిన్నతల్లికి పెట్టరా పిండప్రధానం
కన్ను మూస్తే కల
కన్ను యెరుగకున్నా కడుపు యెరుగును
కన్నుకు తగిలేపుల్ల కనిపెట్టావద్దా
కన్నేలపోయెనో యీ కనకలింగమా అంటే చేసుకున్నఖర్మమోయీ శంభులింగమా అన్నాడట
కప్పకుకాటు బ్రాహ్మణునకు పోటులేదు
కమ్మగుట్టు గడపదాటదు
కమ్మని తుమ్మని నమ్మరాదు
కమ్మనీచు కడిగినాపోదు
కమ్మరివీధిలో సూదులమ్మినట్లు
కరివేపాకు కోసేవాడు వాగినట్లు
కరువున కడుపుకాల్చిన అమ్మను యెన్నటికి మరువను
కరువుమానుప పంట, మిడుతల మానుప మంట
కరువులో బిడ్డనమ్ముకున్నట్లు
కర్ణప్రతాపం
కర్ణుడులేని భారతము, సొంఠిలేని కషాయము
కర్మకు అంతమూలేదు కాలముము నిశ్చయమూ లేదు
కర్మముగల మొగుణ్ణి కంబట్లోకట్టి బుజముమీద వేసుకొంటే జారి వీధిలో పడ్డట్టు
కర్రలేనివాణ్ణి గొఱ్ఱేయినా కరుస్తుంది
కర్రికుక్క కపిలగోవు
కలకాలపు దొంగ కానివాడు దొరుకుతాడు
కలబంద యెండు ... కోడలి కొత్తాలేదు
కలలో పాలుతాగడానికి కంచుదైతేనేమి కనకమైతేనేమి
కలలో భోగము
కలవారి ఆడబడుచుకు కాకరకాయ కానరాదు
కలసివచ్చే కాలమున నడిచివచ్చే పిల్లలు పుట్టుదురు
కలహమున్న కొంపలో కట్టబట్టలుండవు
కలిగితే కాళ్ళుముయ్య లేకపోతే మోకాళ్ళుముయ్యి
కలిగినయ్య కలిగినయ్య కేపెట్టును లేనయ్య కలిగినయ్యకే పెట్టును
కలిగినయ్య గాదె తీసేటప్పటికి లేనివాని ప్రాణంపోయినదట
కలిగినవారి కందకు చుట్టాలే
కలిగినవారింటికి కడగొట్టుకోడలు అయ్యేకన్నా పేదవారింట పెద్దకోడలు మేలు
కలిచిపోసి కలిసికట్టినా వుట్టివంకకే చూస్తాడ
కలిమికులాల మిండడు
కలిమిలేములు కావడికుండలు
కలియుగ భీముడు
కలియుగం రావణాసురుడు
కలియుగం రెండురోజులూ పోవాలి
కల్పవృక్షంక్రింది గచ్చపొద మంచి గంధముచుట్టు నాగుబాము
కల్లపైడికి కాంతిమెండు
కల్లపైడికి గరుకులు మెండు
కల్లుకుండవద్ద కయ్యము, జుట్తులాక్కుపోయే దెయ్యము
కవిలిపండ్లపండితే కరువులు వచ్చును
కష్టపడి యిల్లుకట్టు కొని కల్లుత్రాగి తగలబెట్టినట్లు
కష్టసుఖములు కావడికుండలు
కసపు తీయనిమడి దేవుడు లేనిగుడి
కాంచన కీతకీ కుసుమరాత్రి
కాకము గుడిమీదనున్న గరుడుండగునే
కాకి క రుమంటే గుండె ఝుల్లుంమంటుంది
కాకి గండా గుండిగాని కోకిల పిరికి
కాకి పుట్టీనలుపే పెరిగీనలుపే
కాకికి కలిచల్లడు పిట్టకు పిడికెడేయడు
కాకినితెచ్చి పంజరములోపెట్టితే చిలుకవలె పలుకునా!
కాకిపిల్ల కాకికిముద్దు
కాకిముక్కున దొండపండు కట్టినట్లు
కాకులకు గాని నెమ్ములు పూస్తే నేమి కాస్తేనేమి
కాకులనుకొట్టి గద్దలకు వేసినట్లు
కాగలకార్యం గంధర్వులే తీరుస్తారు
కాగెడుజొన్నలు బుక్కిన కౌజు ముడికాయలు
కాగెడుజొన్నలు బుక్కిన కౌజు ముడికాయలు
కాచినచెట్టుకు రాళ్ళదెబ్బలు
కాటికి కాళ్లుచాచుకొని తిండికిచెయ్యి చాచేవాడు
కాటికిపోయినా కరణాన్ని నమ్మరాదు
కాటిలోపండినవి కాకులుతిన్నవి
కాదు కాదు అంటే నాదినాది అన్నాడట
కాదూ అంటే అరవ్వాడి చెవ్వి
కాదూ అంటే కళతక్కువ ఔనూంటే ఆయుస్సుయెక్కువ
కానకుండా కట్టెడిచ్చెను గాని విడవకుండా వీరణాలు వాయించెనా
కాననివాని పాయసము గంపలాది
కాని కాలమునకు పైబట్ట పక్షులు యెత్తుకపోయినవి
కానికాలము నకు కర్రే పామవుతుంది
కానిమందం కోటి దు:ఖము
కానివాడు లేనివాడితో జత
కానివాని కొంప కాచి చెరచవలెను
కానివేళకు కందులు గుగ్గిళ్ళయినట్లు
కానున్నది కాకమానదు
కాపు నెనరులేదు, కందికి చమురులేదు
కాపు వచ్చినయేడే కరవు వచ్చినది
కారణము లేనిదే కార్యముపట్టదు
కార్తె ముందరవురిమినా కార్యంముందు పదిరినా చెడుతుంది.
కార్యంగొప్పా వీర్యంగొప్పా
కార్యంనాటి పెండ్లికూతురు
కార్యాలకు కరామతులకు ఖర్చుపెట్తినాడుగాని కంచం మార్చి మట్టెలు చేయించలేదు కాలం కలిసిరాకపోతే యేంచేస్తాడు
కాలంమారి కంచు పెంకు అయినట్లు
కాలబెట్టి నేలరాచినట్లు
కాలమందు చేస్తే దేవతలకు ప్రీతి, అకాలమమదు చేస్తే అసురలకు ప్రీతి యిద్దరివాత మన్నుకొట్టు తానన్నాడట
కాలమనేది జవము
కాలము పోవును మాట నిలచును
కాలమునాటి కందిగింజ పెద్దలనాటి పెసరగింజ
కాలమొక్కరీతి గడపవలయు
కాలానికి కడగండ్లు దేశానికి తిప్పలు తప్పవు
కాలికివేస్తే మెడకు మెడకువేస్తే కాలికి
కాలితో నడిస్తే కాశికి పోవచ్చును. తలతో నడిస్తే వాకిలైనా దాటరాదు
కాలితోచూపితే తలతో చెయ్యాలి
కాలినమన్నూ కాలనిమన్నూ అంటవు
కాలీకాలని మొండి కట్టె
కాలుకడుగ కంచుముంతలేదుగాని, కల్లుకు కళాయిగిన్నె కావలెను
కాలుకాలిన పిల్లివలె తిరుగును
కాలుజరితే తీసుకోవచ్చునుగాని నోరు జరితే తీసుకోరాదు
కాలుజారి నేలపడి భూమి అచ్చివచ్చినది కాదన్నట్లు
కాలుపట్టుకొని లాగితే చూరుపట్తుకొని వ్రేలాడినట్లు
కాలువంగినదాని గంగానమ్మ అయినా పట్టదు
కాలువిరిగినయెద్దు గట్టెక్కితే కొమ్మువిరిగిన యెద్దెక్కడ
కాలేకడుపు మండేగంజి
కాళ్ళను చుట్టుకున్నపాము కరవక మానునా!
కాళ్ళు కడుక్కోండవయ్యా అని చాపచేసినట్లు
కావడి యెన్నివంకలు తిరిగినా యిల్లు జేరితేసరి
కాశికి పోగానే కర్రికుక్క గంగిగోవవునా
కాశికి పోయినవాడు, కాటికిపోయినవాడు సమము
కాశికి పోవడము ఒకటి కావడి తేవడము ఒకటి
కాశికిపోయి కుక్కబొచ్చు తెచ్చినట్లు
కాశికిపోయి గాడిద గుడ్డు తెచ్చినట్లు
కాశికిపోయి గొంగరెక్క తెచ్చినట్లు
కాసు గొడ్దుకు రూకబందె
కాసుకు గతిలేదు కోటికి కొడియెత్తినాడట
కిం అంటే కం అనలేడు
కిమాలస్యం? ఆలస్య, అరసస్య, వుంగస్య, వుళియస్య, వేపస్య
కీ వెరిగి కాటో, రే నెరిగి దాటొ, జా గెరిగి బైటో
కీడెంచి మేలెంచవలెను
కుంచములో కదుళ్లు పోసినట్లు
కుంచెడు గింజలు కూలికిపోతే తూమడుగింజలు దూడ తిన్నదట
కుంచెడు బియ్యం గుమ్మడికాయ
కుంటి గాడ్దెకు జూరిందే సాకు
కుంటికులాసం యింటికి మోసం
కుంటెద్దు రానిది దూల మెత్తరు
కుండలోకూడు కూడుగానే వుండాలి, పిల్లలుదుడ్డలై వుండాలి
కుండల్లో గుర్రాలు తోలేవాడు
కుందేటి కొమ్ము
కుంపట్లో తామర మొలచినట్లు
కుక్క అమేధ్యము తిన్నది
కుక్క ఆశ గుండ్రాతితో తీరును
కుక్క వేషమువేస్తే మొరగకుండా వల్లకాదు
కుక్కకాటుకు చెపుదెబ్బ
కుక్కకు నెయ్యి యెక్కడైనా యిముడునా
కుక్కకువచ్చేవన్నీ గొగ్గిపండ్లు
కుక్కతీసినకొయ్యా నక్కతీసిన కొయ్యా
కుక్కతీసినకొయ్యా నక్కతీసిన కొయ్యా
కుక్కతోకపట్టుకొని గోదావరి యీదవచ్చునా
కుక్కదొరికితే కర్రదొరకదు కర్రదొరికితే కుక్క అందదు రెండుదొరికితే రాజుగారికుక్క
కుక్కను అందలము లో కూర్చుండపెడితే ఆమేధ్యంచూచి దిగవురికినదట
కుక్కను ఎక్కి తే సుఖమూలేదు కూలబడితే దు:ఖమూ లేదు
కుక్కను పెంచితే కూటికుండలకెల్లా చేటు
కుక్కనుగొట్ట బచ్చనకొయ్యకావలెనా
కుక్కనుగొట్టితే యిల్లంతా పారుతుంది
కుక్కనుచంపిన పాపము గుడికట్టినా పోదు
కుక్కనుదెచ్చి అందలమునబెట్టగా కుచ్చులన్నిటిని తెగ కొరికినదట
కుక్కముద్దెట్టుకుంటే మూతెల్లానాకుతుంది
కుక్కసంతకుపోయి తునకోల దెబ్బలు తిన్నట్టు
కుట్టితేతేలు కుట్టకపోతే కుమ్మరిపురుగు
కుట్టిన తేలు గుణవంతురాలు కూశినమ్మ కుక్కముండ
కుడబోవుచు కూరాకు రిచి అడిగినట్లు
కుడవమంటే పొడవవస్తాడు
కుప్పకుముందూ కుస్తీకి వెనక
కుప్పతగలబెట్టి పేలాలు వేయించుకు తినేవాడు
కుప్పలొ మాణిక్యం
కుమ్మరపురుగుకు మన్నంటదు
కుమ్మరపూ వాటము
కుమ్మరవీథిలో కుండలమ్మినట్లు
కుమ్మరావములో గచ్చకాయలు వేసింట్లు
కుమ్మరికి ఒకయేడు గుదియకు ఒక పెట్టు
కుమ్మరివారి పెండ్లికూతురు ఆవకట్టకురాక ఎక్కదికి పోతుంది
కుమ్మరివీధిలో కుండలమ్మినట్లు
కుమ్ము చెప్పుకునేటందుకు గూడూరుపోతే యేడుకుమ్ము లెదురుగా వచ్చినట్లు
కురూపి యేమిచేస్తున్నాడంటే సురూపాలన్నీ లెక్కబెడుతున్నాడు
కులపింటి కోతియైనా మేలు
కులమెరిగి చుట్టము స్థలమెరిగి వాసము
కులహీనమైనా వరహీనము కారాదు
కుళ్లికుళ్లి కాయనష్టి కాలి కాలి కాయవష్టి
కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయంచేసినది
కూటికి గింజలేక కొరముట్లులేక సేద్యముచేసేది చెడ్డరోత
కూటికి పేదయైతే కులానికి పేదా
కూటికివ్వలేని వేటకాని పోటెందుకు
కూడు ఉడికిన వెనుక పొయ్యిమండుతుంది కులంచెడిన వెనుక బుద్ధివస్తుంది
కూడుగుడ్డ అడుగకపోతే బిడ్డను సాకింట్లు సాకుతాను
కూడైతే కద్దుగాని కులస్థులకు వెరచి వచ్చినాను
కూత కరణము
కూతలార్భాటమేగాని కుప్పలో గింజలేదు
కూతురని కుంచెడిస్తే తల్లి అని కంచెడు పెట్టినది
కూతురికి మంగళవారం, శుక్రవారం, కోడలుకు దియ్యలు దియ్యలు
కూతుళ్ళను గన్నమ్మకు కుర్చీపీటలు, కొడుకులగన్నమ్మకు గోడపంచలు
కూర్చుండి తింటూవుంటే కొండైనా సమసిపోతుంది
కూర్చుండి పడుకోవలెను
కూర్చుండి లేవలేడుగాని ఎగసితాటికాయలుతన్నుతాడాట
కూర్చుండి లేవలేడుగాని వంగుండి తీర్ధంవెళ్ళుతాడట
కూలికివచ్చి పాలికి మాట్లాడి నట్లు
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచినది
కృతఘ్నునికి చేసిన మేలు
కేశవా నారాయణా అవ్వా బువ్వా పెట్టు
కొంగు తడిస్తే చలిగాలి కోకంతా తడిస్తే చలియేమిటి
కొండ తలక్రింద పెట్టుకొని రాళ్ళకొరకు వెతకినట్లు
కొండ వలెవచ్చి మంచువలె తేలినట్లు
కొండ వలెవచ్చి మంచువలె తేలినట్లు
కొండంత దూదికి కొండంత నిప్పు కావలెనా
కొండంత దేముణ్ణి కొండంత పత్రితో పూజిస్తారా
కొండంత మగడేపోగా గుప్పెడు బొచ్చు కేడ్చినట్లు
కొండంత రెడ్డేపోగా పిడికెడు బొచ్చుకేడ్చినట్లు
కొండకు ఒక వెంట్రుక ముడివేస్తే వస్తే కొండేవస్తుంది పోతే వెంట్రుకే పోతుంది
కొండతవ్వి యెలుకను పట్టినట్లు
కొండతో తగరు డీ కొన్నట్లు
కొండను చూచి కుక్కల మొరిగినట్లు
కొండమంగలి క్షవరము
కొండమింగేవానికి గోపురమడ్డమా
కొండమీదనుండి రాళ్ళు దొల్లించినట్లు
కొండమీది గబగబ లేమంటే కోమటిరహస్యాలు
కొండమీదినుంచి పడ్డవానికి గాయములెన్ని
కొండయెక్కేవాని మొలను కొడవలి చెక్కినట్లు
కొండానాల్కకు మందువేస్తే వున్న నాలిక వూడినట్లు
కొంపతీస్తావా రామన్నాఅంటే అందుకు సందేహమా అన్నట్లు
కొట్టకముందే యేడుస్తావేమీఅంటే ముందు కొట్టెదరేమో అని యెడ్చుచున్నా నన్నట్లు
కొత్త అప్పుకుపోతే పాత అప్పు పైనపడ్డది
కొత్తకుండలో జోరీగ చొచ్చినట్లు
కొత్తగుడ్డకంటినట్టు రంగు పాతగుడ్డకంటదు
కొత్తది గొర్రెలమడుగు పాతరి డర్రెలమడుగు
కొత్తనీరువచ్చి పాతనీరు కొట్టుకుపోయినట్లు
కొత్తనీళ్ళకు చేపలు యెదురీది నట్లు
కొత్తబిచ్చగాడు పొద్దెరుగడు
కొత్తవింత పాతరోత
కొనగా తీరనిది కొసరగా తీరునా
కొనజాలకు కోతిపుట్టితే, కులము వాళ్ళంతా కూడి కుక్క అని పేరు పెట్టినారట
కొనబోతే కొరివి అమ్మబోతే అడివి
కొన్నది వంకాయ్ కొసిరేది గుమ్మడికాయ
కొన్నవాడే తిన్నవాడు
కొన్నవా'దికికన్న తిన్నవాడే మేలు
కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు వెలుతురు
కొబ్బరిచెట్టు ఎందుకు యెక్కుతావురా అంటే దూడ గడ్ది కోసం
కొబ్బరిచెట్టుకు కుడితి మృత్యువు
కొయ్యరా కొయ్యరా పోలిగా అంటే....... టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడట
కొరివితో తల గోకుకున్నట్లు
కొఱ్ఱకు నక్క కొర్ర
కొలిచేవాడు గుడ్డివాడే, కొలిపించేవాడు గుడ్డివాడే
కొల్లు మునిగిన కొన్నాళ్ళకు కోనామములిగినది
కొల్లెట్లోపండే పంటేగాని చచ్చే దున్నపోతులకు లెక్క లేదు
కొల్లేటి బ్రహ్మహత్య మేపుమీదుగా పోయించి
కొసరిన కూరలో గాని పసలేదు
కోటి విద్యలు కూటి కొరకే
కోటికి కులాసంలేదు, కోమటికి విశ్వాసంలేదు
కోడలికి బుద్ధిచెప్పి అత్త రంకునబోయినది
కోడలు కొడుకును కంటానంటే వద్దనే అత్తగారుంటుందా
కోడలు గృహప్రవేశం అత్త గంగా ప్రవేశం
కోడలు నలుపైతే కులమంతా నలుపు
కోడి గృడ్డంత బంగారం లేనివాడున్నాడా
కోడికున్న కోర్కెలు పిల్లికేమి యెరుక
కోడిగుడ్డు పగులగొట్ట గుండ్రాయి కావలెనా
కోడిని గద్ద తన్నుక పోయినట్లు
కోడిపిల్లమీద పందెపిల్లపడ్డట్టు
కోడిపోయి కొమ్మయెక్కినట్లు
కోతికి అద్దము చూపినట్లు
కోతికి అద్దము చూపినట్లు
కోతికి కొబ్బరికాయ దొరికినట్లు
కోతికి జల్తారు కుళ్లాయి
కోతికి తేలుకుట్టినట్లు
కోతికిబెల్లం చూపరాదు కోమటికి ధనంచూపరాదు
కోతిగురువిందసామ్యం
కోతిచావు కోమటిరంకు
కోతిచేతి పామువలె
కోతిచేతి పూలదండ
కోతిపిడికిలి
కోతిపుండు బ్రహ్మరాక్షసి
కోనకావలి
కోపము పాపకారణము
కోమటి నిజము
కోమటి పిరికి కొట్టితేవురికి
కోమటి భక్తుడు కాడు తగరం కత్తికాదు
కోమటి విశ్వాసము
కోమటి సాక్ష్యం
కోమటియిల్లు కాలినట్లు
కోమట్ల కొట్లాట గోచిపుగులాట
కోల ఆడితే కొతి ఆడుతుంది
కోలలేనిపెట్టు తాడులేనికట్టు
కోళ్ళకురెక్కలు తాళ్ళకు చళ్ళు వున్నట్లు
కోళ్ళబేరానికివెళ్ళి కోటలో కబుర్లూడిగినట్లు
కోవెలపోయి కొమ్మ యెక్కినట్లు
క్షేత్రమెరిగి విత్తనము పాత్రమెరిగి దానము
కనుమకాకర భోగి పొట్లకాయ
కల్లుకుండవద్ద కయ్యము, జుట్తులాక్కుపోయే దెయ్యము
కుక్క తెచ్చేవన్నీ బొమికెలు
కుడుములు వండలేని ఆడది కూనిరాగం తీయలేని మగవడు లేరు
కొండవీటి చేంతాడు
కొరివితో తల గోకుకున్నట్లు
Post a Comment