Telugu Samethalu Lettter LA(ల)
లంక కాల్చినవాడు హనుమంతుడు
లంకలో పుట్టిన వారెల్లా రాక్షసులే
లంచము పెట్టినదిమాట పుంజము పెట్టినది బట్ట
లక్కసాసొసులు తొడుకొని లటలట పోతావుగాని వాకిలి యెవడు నూకు తాడోయి వన్నెకాడ
లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడు కాడు
లక్షణాలుగల బావ గారికి రాగిమీసాలు అవలక్షణాలు గల బావగారికి అవీలేవు
లడాయి అంటే వెనుకకు పోతాడు అన్నమంటే ముందుకు పోతాడు
లడాయి వచ్చినప్పుడా కత్తులు చేసుకోవడం
లబ్డుడికి పనినిండా, లుబ్డుడికి ఖర్చునిండా
లాభములేనిది పెట్టి యేటపడడు
లేకలేక లోకాయ పుట్టితే లోకాయ కన్ను లొట్ట
లేకుండాచూచి పోకుండా రాబట్టు
లేనిఉదారికంటే కలిగిన మొడిమేలు
లేనిదానికి పోగా ఉన్న దూడినట్లు
లేనిబావకంటె కలిగిన మొండిమేలు
లేవలేని అత్తకు వోపలేనికోడలు
లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టు కుంటే యేమి లాభం
లోని ముయ్యగలరు గాని లోకం ముయ్యగలరా
లోపాలులేనిపాలన వంకరలేని కుక్కతోక ఆదర్శ మంత్రాలు
లోభిని చంపవలె నంటే దబ్బు అడిగితే సరి
Post a Comment