Telugu Samethalu Lettter MA(మ)
మంగలినిజూచి యెద్దుకుంటుతుంది
మంగలివాడి గుంటపెల్లగిస్తే బొచ్చుబైటపడుతుంది
మంచికాలానికి మామెళ్లు చెడ్డకాలానికి చింతలు
మంచికిపోగా చెడ్డ యెదురైనట్లు
మంచిజేసిన ముంగికి మరణం యెదురైనట్లు
మంచిప్రాణానికి మండలంవరకు భయంలేదు
మంచిమంచిఅంటే మదురెక్కి నాట్యమాడెనట
మంచివానికి మాట్లాడనిదే మందు
మంచివానికి వకమాట మూర్ఖునికి వకచేట
మంచివానికేవచ్చెనా మరణకాగితం
మంచివారికొక మాట మంచిగొడ్డుకొకదెబ్బ
మంత్రంచెప్ప మల్లిభొట్లూ తినడానికి ఎల్లిభొట్లు
మంత్రము లోపములెకున్నా తుపర్లకు లోటులేదు
మంత్రములేని సంధ్యకు మరిచెంబెడు నీళ్లు
మంత్రసానిముందర మర్మముదాచినట్లు
మంత్రాలకు మామిడికాయలు రాలునా
మందినిముంచి మసీదుకట్తినట్లు
మందియెక్కువైతే మజ్జిగపల్చన
మందుకుపోయినవాడు మాసికమునకు వచ్చును
మక్కాకుపోయి కుక్కమలం తెచ్చినట్తు
మఖ పుబ్బలు వరపైతే మహత్తరమైన కాటకం
మఖకు మానికంతచెట్టయితే కార్తీకమునకు కడవంత గుమ్మడికాయ కాసును
మఖలో పుట్టి పుబ్బలోపోయినాడు
మఖవురిమితే మదురుమీద కర్రయినాపండును
మగడువల్లనమ్మను మారీవల్లదు
మగవానిబ్రతుకు చిప్పనిండమెతుకు ఆడదానిబ్రతుకు గంజిలో ఒక మెతుకు
మగులెన్ని చెప్పినా మామపక్కవీడదు
మగ్గానికి ఓక రాయి మరవకుండా పట్టండి
మజ్జికకువచ్చి ముంతదాచినట్లు
మట్టిగడ్డలో కప్పకూస్తే ఒకఝాముకు వర్షము
మట్టిగుర్రాన్ని నమ్మి ఏట్లో దిగినట్లు
మట్టియెద్దైయినా మాయెద్దే గెలవాలి
మట్టుమీరిన మాటకు మారులేదు
మడికి గట్టు యుఇంటి గుట్టుమంచిది
మడిదున్ని మహారాజైనవాడు చేనుదున్ని చెడినవాడు లేడు
మడిని పడ్డనీరు పైబడ్డ దెబ్బ పోనేరదు
మడ్డిముండకు మొగలిపూలిస్తే మడిచి ముడ్డిలోపెట్టుకుందిట
మతిమీద మన్నుపోతు నిప్పుకుపోయి వుప్పు తెత్తు
మతులెన్ని చెప్పినా మంకుబుద్ది మానదు
మదుంవారి మడియైనా కావలె మాటకారి మగడైనా కావలె
మధుకరం నానింటికి ఉపదానం వాడు పోయింట్లు
మనబంగారం మంచిదైన కంసాలి యేమెచేయును
మనమడు నేర్చుకున్నట్లు అవ్వకు దురదతీరినట్లు
మనమెరుగని చెవులకు మద్దికాయలా
మనసు మహామేరువ దాటుచున్నది కాలుగడప దాటలేదు
మనసెరుగని కల ఒడలెరుగని శివం గలదా
మనిషికి రాక మ్రానుకువస్తుందా
మనిషికి వున్న పుష్టి పనిరానికి తిన్నపుష్టి
మనుము చెడి ముండ బుద్దిమంతురాలైనది
మనువును నమ్మి బొంత బోర్ల తీసుకున్నట్లు
మనుష్యులు పోయినా మాటలు నిలచును
మన్నుపట్టితే బంగారం, బంగారంపట్టితే మన్ను
మన్నుమగ్గితే మాలినికైనా పైరగును
మన్నువెళ్ళకుండా దున్నితే వెన్ను వళ్ళకుండా పండును
మన్మధుడే పురుషిడైనా మాయలాడి తన మకుబుద్ది మానదు
మరిచిపొయి మారుబొట్టుతో మజ్జిగబొట్టు వేసింది
మర్చిపోయి చచ్చినా ప్రాణమా రమ్మంటే వచ్చునా
మర్యాద రామన్న మాన తప్పినా వ్రేటుతప్పదు
మలపసన్యాసికి మాసకమ్మకూ జత
మలుగులు క్రుంగితే మాపటికి యీనుతుంది
మళయాళములో చెవులు కుట్టుతారని మాలూవరం నుంచి చెవులు మూసుకొని పోయినట్లు
మసిపూసి మారేదుకాయ చేసినట్లు
మసిముఖంవాడు చమురు కాళ్లవాడు పోగయినట్లు
మహా మహావాళ్ళు మదుళ్ళక్రింద వుంటే గోడచాటువారికి శరణము
మహాలక్ష్మి పరదేశం పోయినట్లు
మా పిల్లవానికి ముప్పదిరెండు గుణములున్నవి గాని రెండు తక్కువ
మాంసం తింటామని యెముకలు దండవేసు కుంటారా
మాగిలి దున్నితే మానికైనా పండును
మాఘ మాసపు చలి మంటలో పడ్డా తీరదు
మాఘ మాసపు వాన మొగుడు లేని చాన
మాఘమాసంలో మ్రాకులు సైతం వణుకును
మాట లెన్ని చెప్పినా మామగారి పొత్తు వదలనందిట
మాటకు కాట తెగులు నీటికి నాచు తెగులు
మాటకు మాట శృంగారం పేటకు కోట శృంగారం
మాటలకు మల్లి, పనికి యెల్లి
మాటలు కోటలు దాటుతవి, కాలు గడపదాటదు
మాటలు తల్లి పెట్టు మారు తల్లి
మాటలు తేటలు మాయింట, మాపటి భోజనము మీ యింట
మాటలు నేర్విన కుక్కను వేటకు బంపితే వుజ్జో అంటే వుజ్జో అన్నదట
మాటాడితేమల్లెలు కాటాడితే కందిరీగలు వొలుతవి
మాదిగ మంచానకు తలవైపూ కాళ్ళవైపూ వొకటే
మాదిగ మల్లి కంసాలి యెల్లి
మాధల్వభొట్లకు పడిశం యాటా రెండుసార్లు రావటం, వచ్చినప్పుడల్లా మాసాలు వుండటం
మానంపోయిన వెనుక ప్రాణమెందుకు
మానని రోగానికి మందు వద్దు ఈనిన కుక్క వున్నది మాయింట
మానిపోయిన పుండు మళ్లి రేపినట్లు
మాను పండ్లు మాను క్రిందనే రాలుతవి
మాను పేరు చెప్పి పండ్లమ్ముకోవచ్చు
మానును చూచేవా మనును పట్టిన భూతాన్ని చూచేవా
మానుపిల్లి అయినా మట్తి పిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి
మానెడు పిండవచ్చును గాని చెట్టె డెక్కించరాదు
మామతో కూడా మంచం అల్లి తాతతో దడికట్ట వచ్చిందట
మామిడి మగ్గితే సజ్జలు పండును
మామిళ్లు కాస్తే మశూచికములు మెండు
మార్గ సిరములో మహత్తయిన చలి
మార్గశిరమ లో మాట్లాడటానికి పొద్దువుడదు
మాలకూటికి లోబడ్డా, పప్పుబద్ద దొరకదు
మాలలకు మంచాలు బ్రాహ్మణులకు పీటలు
మాలాయ గారికి కోలాయ గారు గురువు
మాశిపెద్ద మాశివుండావు బుద్ది గాడ్దె బుద్ది వుండావు
మాశిమీద మా శియెక్కి కూర్చుంటే మోసిమోసి చచ్చినా నన్నాడట
మాసొమ్ము మాకిచ్చుట మడిమాన్యము లిచ్చుట
మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగినూనె
మింటికన్నాపొడుగు నగిరికన్నా ధాష్టీకంలేదు
మిండడి యీవియెంతో లంజమక్కువ అంతే
మిండలను మరగిన అమ్మ మీగడతిన్న అమ్మ వూరు కుండదు
మిగిలిన సున్నాన్ని నొగిలినరాజును వదలకూడదు
మితము దప్పితే అమృతమైనావిషమే
మిధునంలో మొక్క మీసకట్టున పుట్టిన కొడుకు
మిధునంలో మొక్క మీసకట్టున పుట్టిన కొడుకు
మిన్ను విరిగి మీదపడ్డట్టు
మీగాలిమీద మెతుకుపడితే మిట్టిమిట్టి పడ్డాడు
మీగాళ్లు వాచినమ్మా మీయింట్లోపెళ్ళి యెప్పుడంటే మోకాళ్లువాచినమ్మా మొన్ననే అయుపోయినదందిట
మీగురువులు మాశిష్యులవద్దనే నేర్చుకున్నారు
మీగొడ్డుకింత తవుడంటే మీఅబ్బాయికిన్నిపాలు
మీదాకులు రాలంగ క్రిందాకులునవ్వినట్లు
మీయింటికివస్తాను నాకేమిపెడతావు మాయింటికి వస్తావు నాకేమితెస్తావు
మీరుకొలుచునట్లు మీకుకొలువబడును
మీసాలుతట్టపోసి వాసాలుతట్ట పోసికొనుము
ముంజేతి కంకళాలకు అద్దముకావలెనా
ముండ బెంచినబిడ్డ ముక్కు తాడులేని యెద్దు
ముండ ముప్పావుకు చెడ్డాడు నరకడు పావుకుచెడ్డాడు
ముండ మొయ్యవచ్చునుగాని నిందమొయ్యరాదు
ముండకొడుకు కేకొడుకు రాజుకొడు కేకొడుకు
ముండ్లమీదపడ్డ గుడ్డ మల్లగా తీసుకోవలెను
ముంతెడు నీళ్లకే జడిస్తే బానెడు నీళ్లెవరు పోసు కుంటారు
ముంతెడుపాలకు ముత్య మంత చేమిరి (తోడు)
ముందటివానికి ముంతంబలి వెనుకటి వానికి తెడ్డంబలి
ముందరికాళ్ళకు బందాలువేసి ముండలతాళ్లు తెంపేవాడు
ముందు నీకంటిలోని దూలము తొలగించుకొని తరువాత నీపొరుగువాని కంటిలో నలుసును తీయుము
ముందుజూస్తే అయ్యవారిగుఱ్ఱం వెనుకచూస్తే సాయబు గుఱ్ఱం
ముందుపొయ్యే ముతరాచవాణ్ణి వెనుకవచ్చే బోయవాణ్ణీ పక్కవచ్చే వట్రాతివాణ్ణి నమ్మరాదు
ముందువచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడి
ముందువచ్చినందుకు మున్నూరు వరహాలు దండుగ మళ్ళి యేలవచ్చినావే మాయదరితొత్తా
ముందువచ్చినది మొత్తైదువ వెనుకవచ్చినది వెధవ
ముక్కు కోసినా ముందు ముగుడే మేలు
ముక్కుజొచ్చి కంట్లో ప్రవేసించే వాడు
ముక్కుపట్టుకుంటే ప్రాణము పోదా
ముక్కులో యేవేలు పెట్టినా వాటే
ముక్కులో వెండ్రుకలు కొప్పు లోకొచ్చి మూగవాడు అమ్మా అన్ననాడు చూదాము
ముక్కువుండేవరకు పడిశంవుంటుంది
ముఖం చూస్తే కనపడదా మీగాళ్లవాపు
ముఖం బాగాలేక అద్దము పగులగొట్టినట్లు
ముఖం మాడువుదీపం యింటికి కొరగాదు, రంకుబోతు పెండ్లాం మొగుడికి కొరగాదు ఏడ్పుగొట్టు బిడ్డ చంకకు కొరగాదు
ముగ్గురాడవారుకూడితే పట్టపగలు చుక్కలుపొడుచును
ముగ్గురి మధ్య ముంత దాగింది
ముగ్గురిని గూర్చెను ముండ దయ్యము
ముడ్డిక్రిందికి నీళ్ళువస్తే లేవక మానదు
ముడ్డిమీదకొట్టితే మూతిపంద్లు రాలినట్లు
ముడ్ది ముఖంలేనిబిడ్డ తుది మొదలు లేని వాట
ముది ముప్పున అంగిట ముల్లు
ముదిమి తప్పితే మూడు వర్ణాలు
ముదిరి చచ్చినా యెండి విరిచినా వగవు లేదు
ముదురున వేసినపైరు ముదిమి పుట్టిన కొడుకు
ముద్దుచేసి కుక్కమూతికరచను
ముద్దున పేరుచెడె మురిపాన నడువుచెడె
ముద్దులు గులకరా ముదిపెండ్లి కొడకా అంటే పెండ్లి కొచ్చిన పేరంటాండ్రందరు నాపెద్దపెండ్లాలే అన్నాడట
మున్నూటి కులానకు ముప్పూ లేదు మొండి కాలికి చెప్పూలేదు
మున్నూరుసిఖలైనా కూడవచ్చునుగాని మూడుకొప్పులు కూడరాదు
ముప్పదియేండ్ల ఆడుది మూడేండ్లమగవాడు ఒకటి
ముప్పదియేండ్లు కష్టమనుభవించినవాడు లేడు
ముప్పైతట్టల పేడమోసేపోలికి మూడుపుంజాల దండ బరువా
ముఫ్పైమూడుకోట్ల దేవతలు ముక్కుపట్టించగలరుగాని నారాయణా అని అనిపించగలరా
మురదన్న సందేహం నిస్సందేహం
మురిపెము తిరిపెముచేటు ముసలిమగడు ప్రాణమునకు చేటు
మురిపెమునకు మూడునల్లపూసలు కొలికకు ఒక తిరుగట్రాయి
ములక కాయకు తగినముండ్లెప్పుడున్నవో కాకరకాయకు తగినగరుకు లప్పుడేవున్నవి
ముల్లాలు తిండిలేక మొత్తు కుంటుంటే పీర్లకు పంచదార
ముల్లు ముంటతీస్తే పోయే దానికి దబ్బనాన తీసినట్లు
ముల్లువచ్చి కొర్రడచి నట్లు
ముసలమ్మా బుఱ్ఱ వణికిస్తావేమటే వూరకుండి నేనేమి చేస్తా నన్నదట
మూగవాని ముందర ముక్కు గోకు కున్నట్లు
మూటికీ ముడి వేస్తే యేమీతేదు
మూడు దినాల ముత్తైదువ తనానికి ఆరు జోళ్లు లక్కాకులు
మూడు నలలు సాముచేసి మూలనున్న ముసిలిదాన్ని పొడిచినాడు
మూడు భాగాలు సిద్ధమైనవి, దివ్వెకట్ట ముడికి వచ్చినది దొరవారు సువారానికి రావచ్చు
మూడు భాగాలు సిద్ధమైనవి, దివ్వెకట్ట ముడికి వచ్చినది దొరవారు సువారానికి రావచ్చు
మూడు రోజులుంటే మురికి చుట్టం
మూడునాళ్ళ ముత్తైదువతనానికి ఆరుజోళ్ళ లక్కఆకులు
మూడేండ్ల నాటి గుణము నూరేండ్ల వరకు
మూరెడు పోనేల బారెడు కుంగనేల
మూర్తి కొంచెమైనా కీర్తి విస్తారం
మూల కార్తెకు వరి మూలకు చేరు తుంది
మూల కురిస్తే ముంగారు పాడు
మూల పున్నమ ముందర మాదిగైనా చల్లడు
మూల వర్షం ముంచును జ్యేష్ఠవర్షం తేల్చును
మూల వున్నదాన్ని ముంగిట్లోకి తెచ్చినట్లు
మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరుపువ్వులుగ పండును
మూలవిగ్రహాలు ముష్టియెత్తు కుంటుంటే ఉత్సవిగ్రహాలకు ధధ్యోజనాలు
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు
మూలుగు ముందటివలెనే తిండి యెప్పటివలెనే
మృగశిర కురిస్తే ముసలియెద్దు రంకె వేయును
మృగశిరకు ముంగిళ్లు చల్లబడును
మృగశిరలో పైరు మీసకట్టున పుట్టిన కొడుకు
మెచ్చిమేకతో లూ కోరి గొర్రెతోలు కప్పుతారు
మెట్టనువున్నా యేనుగే పల్లానవున్నా యేనుగే
మెడకు పడిన పాము కరవక మానదు
మెతుకులు చల్లితే కాకులు తక్కువా
మెత్తనాళ్ళుపోయి చెత్తనాళ్లు వచ్చినవి
మెత్తనివానిని చూస్తే మొత్తబుద్ధి
మెత్తనివారిని మొత్తబుద్ది
మెరుగు వెయ్యకగాని మృదువు కాదన్నం
మేకలుతప్పితే తుమ్మలు మాటలతప్పితే యీదులు
మేడికాయపై మిసిమి మేత కరణము
మేలుమేలంటే మడవిరగబడ్డట్టు
మొండి ముక్కున ముక్కెర వున్నట్లు
మొండికి బండకీ నూరేండ్లాయుస్సు
మొండికి సిగ్గూ లేదు మొరడుకు గాలీలేదు
మొండికెక్కినదాన్ని మొగుడెమిచేయును రచ్చకక్కిన దాన్ని రాజేమిచేయును
మొండిచేతితోటి మొత్తుకున్నట్లు
మొండిచేతివానికి నువ్వులు తిననేర్పినట్లు
మొండివాడు రాజుకన్నా బలవంతుడు
మొక్కబోయిన దేవర ఎదురుగా వచ్చినట్లు
మొక్కబోయిన దేవళము విరిగి మీద పడ్డట్లు
మొక్కుబడే లేదంటే ఒక్క దాసరికైనా పెట్టుమన్నట్లు
మొక్కేవారికి వేరవనా మొట్టేవారికి వెరవనా
మొగము మాడ్పులది మగనికి చేటు యీడ్చు కాళ్ళది యింటికిచేటు
మొగుడి తలమీద మిరియాలు నూరినట్లు
మొగుడు కొట్టితే ముక్కు చీమెడే పోతుంది
మొగుడు కొట్టితే ముక్కు చీమెడే పోతుంది
మొగుడు కొట్టినందుకు కాదు గాని తోడికోడలు వెక్కిరించి నందుకు విచారం
మొగుడు చచ్చిన వెనుక ముండకు బుద్ధి వచ్చింది
మొగుడు చచ్చిమొర్రో అంటుంటే మిండ మొగుడు వచ్చి బిడ్డలు పుట్టిస్తాలే అన్నాడట
మొగుడు లేని దానికి మంత్ర సానెందుకు
మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది
మొత్తుకోళ్ళోయి ముత్తంశెట్టి
మొదట మానెడు దూడ చస్తేదుత్తెడు
మొదట మోదుగ పూస్తే, కొనసంపంగి పూసును
మొదటికి మోసం, లాభానికి గుద్దులాట
మొదలు దుర్భరం అందులో గర్బిణి
మొదలు మన్ను కరువువస్తె గడ్డలు
మొప్పులేనివాడే మొదటి సుజ్ఞాని
మొయిలు విడచిన యెండ, మొగుడు విడచినముండ, వట్టివిడచినమండ, ఎత్తి విడచిన కుండ తీక్షము
మొయిలును నమ్మి చెరువు కట్ట తెగకొట్టినట్లు
మొరకునకు శివమెక్కిన మొక్కక తప్పదు
మొర్రో వద్దనగా లింగం కట్టేరు గాని మొక్కచేతులు తేగలరా?
మొల మట్టు దు:ఖములో మోకాలు మట్టు సంతోషం
మొసలిబావా కడింవేరాయిగాని కాలయినాయింతేకదా
మోకాలు మణిగిందని ముక్కుముంచు కుంటారా
మోక్షానికిపోతే మొసలియెత్తుకపోయింది
మోచేయాడితే ముంజేయాడు తుంది
మోటకు మొదటిచోటకంపు వన్నెగాడికి వళ్ళంతా కంపు
మోసేవానికి తెలుసు వావటిబరువు
మాదిగవాడి బార్త్యెనా మండేకాలికి చెప్పులేదు
మూడు మూఠా వొకచుట్టే ముఫైమురా వొకచుట్టే
Post a Comment