Telugu Samethalu Lettter NA(న)
నంగి వంగలు మేస్తే నారికేళాలు దూడలు మేసినవన్నట్లు
నందిఅంటే నంది పందిఅంటే పంది
నంబి, దంబళీ, నాగుపాము చెవులపిల్లి యెదురై తేచేటు
నంబీనంబీ యేంసహాయం చేస్తావంటే నీపెండ్లి కెదురగా రానులే అన్నాడట
నక్కకూసి పిల్లలకు దారితెస్సును
నక్కజిత్తులన్ని నావద్దవుండ నన్ను మోసముచేసె తాబేటిబుర్ర
నక్కను చూచివాడెల్ల వేటకాడే
నక్కపోయిన వెనుక బొక్క కొట్టుకున్నట్లు
నక్కలెరుగని బొక్కలు నాగులెరుగుని పుట్టలూవుండునా
నక్కానక్కా నానామం చూడు తిరిగిచూస్తే తిరుమణిచూడు
నట్టింటికి పోచిళ్లు చల్లినట్లు
నట్టేట పుట్టి ములిగినట్లు
నడమంత్రపుదాసరి పొద్దుమానం యెరుగడు
నడమంత్రపుశిరి నరాలమీద కురుపు
నడవలేనమ్మకు నాలుగుపక్కలా సవారి
నడిచేకొద్ది డొంక, పెట్టేకొద్దీ కుదురు
నత్తగుల్లలన్నీ ఒకచోట నవరత్నాలన్నీ ఒకచోట
నత్తగుల్లలన్నీ ఒకరేవున ముత్యపుచిప్పలన్నీ వొకరేవున
నన్ను నేనే యెరుగను నిన్ను నేనేమి యెరుగుదును
నపుంసకునిచెంత నవలాసరసత్వము
నమాజు చెయ్యబోతే మసీదు మడనుబడింది
నమ్మి నడివీధిలో పోసినవారెవరు
నమ్మితిరామన్నా అంటే నాఅంతవాణ్ణీ చేస్తానన్నట్లు
నమ్మినాను రామన్నా అంటే నట్టేట ముంచుతాను లక్ష్మన్న అన్నాడట
నయం నష్టకారి భయం భాగ్యకారి
నరములులేని నాలుక నాలుగు విధాలు
నరుల్నికంట నల్లరాయిపగులును
నలుగురితోపాటు నారాయణ కులందోపాటు గోవింద
నల్ల మొగులు వానగొట్టదు నవ్వుమొగమువాడు దానముచెయ్యడు
నల్లపూసకు తెల్లపూసాలేదు తెల్లపూసకు నల్లపూసా లేదు
నల్లినలిగిపోయినది చెత్తకానము
నల్లినిగూర్చి మంచానికిపెట్టు
నవగ్రహాలూ వక్రించియున్నవి
నవాబు పాతుల్లాఖాన్ అవ్వనాటిది
నవాయత్ పొట్టా తమలపాకులకట్ట తడువుతూవుండాలి
నవిలేవానికన్న మింగేవాడు ఘనుడు
నవ్వజెప్పేవాడు చెడజెప్పను యేడవజెప్పేవాడు బ్రతికజెప్పును
నవ్వుతూ కోసినముక్కు యేడ్చినారాదు
నవ్వుతూ తిట్టితివో నరకాన బడితివో
నవ్వుతూచేస్తే యేడుస్తూ అనుభవింపవలెను
నవ్వే ఆడదాన్ని యేడిచే మగవాణ్ణి నమ్మరాదు
నాకాయుష్యం నాకారోగ్యం మీకురుణం మాకుధనం
నాకాయుష్యం నాకారోగ్యం మీకురుణం మాకుధనం
నాకు పరీక్షా నా రాగిచెంబుకు పరీక్షా
నాకు సిగ్గూలేదు నీకు యెగ్గూలేదు
నాకు సొగసెందుకు బాగుంటేచాలు
నాకుసిగ్గూలేదు రేపువచ్చే అమావాస్యకుయెగ్గూలేదు
నాకూ నాపిల్లకూ నూరేండ్లాయుస్సు నాపెనిమిటికి లోకంతోపాటు
నాకూబెబ్బేబా అంటే నాకుబెబ్బే నీకుబెబ్బే అబ్బకు బెబ్బే అన్నాడట
నాకోడీ కుంపటీ లేకపోతే యెలా తెల్లవారుగుంది
నాగుబాము చిన్నదనద్దు పాలివాడు సన్నమనవద్ధు
నాచెయ్యి నొస్తున్నది నీచేతో మొత్తుకోమన్నాడట
నాజూకు నక్కలుదేకితే నెరిసినగడ్డం కుక్కలు పీకినవి
నాటకములు బూటకములు బోటితనములు నీటులు
నాడు నిలబడలేదు, నేడు కూలబడలేదు
నాడు వ్రాసినవాడు నేదు చెరిపి మళ్ళ వ్రాస్తాడు
నాడుకట్టాలేదు, నేదుచించాలేదు
నాడులెంచెవారేగాని గోడు చూచేవారు లేరు
నాడువుంటే నవాబు సాహెబు అన్నంటే అమీరుసాహెబు బీదపడితే పకీరుసాహేబు, చస్తే పీరుసాహేబు
నాధుడు లేని రాజ్యం నానాదారులైనది
నానాటికి తీసికట్టు నాగంభొట్లు
నానారుచులుపారి నాలికమీద కొరివిపెట్టుకున్నట్లున్నది
నానెత్తురు నానోట కొట్టు తాడు
నాపప్పు కలిసినంత నేనే తింటాను
నాపాదమెగతి అన్నట్లు నాభాగ్యం దేవర చిత్తం
నాప్రతివ్రతాధర్మం నా మొదటి భర్తకు తెలుసు
నాభిలో పుట్టిన పురుగువంటివాడు
నాముందర నీవేమి బ్రతక గలవు
నాయింటికి నేనే పెద్దను పిల్లికి పెట్టరా పంగనామం
నారిగాడు, నారడు, నారాయుడు, నారాయ్య, నారయ్య, నారాయణయ్య, నారాయణరావు, నారాయణరావు పంతులు, నారాయణరావు పంతులుగారు
నారుపోశినవాడు నీరుపొయ్యడా
నాలికా నాలికా వీపుకు దెబ్బలు తేకే
నావేలు పుచ్చుకోని నాకన్నె పొడిచినావా
నాసిరి కన్నా నా అక్కసిరి, నాఅక్కసిరికన్నా నాసిరి ఘనం
నిజం నిలకడమీద తెలుస్తుంది
నిత్యము చచ్చేవారికి యేడ్చేవారెవరు
నిత్యము చచ్చేవారికి యేడ్చేవారెవరు
నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచియెరుగదు
నిద్రపోయినవాడి కాళ్ళకు మ్రొక్కినట్లు
నిద్రపోయేవాణ్ణి లేపవచ్చునుగాని మేలుకున్నవా ణ్ణేవరు లేపుతారు
నిన్న కుప్పా యివ్వాళ ఆళ్లు
నిప్పుకు నీళ్ళకూ వుండే స్నేహం
నిప్పుకొట్టితే నీళ్లవునుగాని నీళ్ళుకొట్టితే రెండగునా
నిప్పుముట్టనిది చెయ్యికాలదు
నిప్పులబుర్రకు నీళ్ళబుర్ర
నిప్పులు వళ్ళోకట్టుకున్నట్లు
నిమ్మకర్మ నిత్యకర్మ నమ్మకర్మ సష్టకర్మ
నిరక్షర కుక్షి విరూపాక్ష దీక్షితులు వారి కిరవైయొక్క భక్ష్యమొక లక్ష్యమా అన్నట్లు
నిర్భాగ్యునికి నిద్ర అభాగ్యునికి ఆకలి
నిలుచుంటానికి జాగాదొరికితే కూర్చుంటానికి అప్పుడే దొరుకుతుంది
నిశ్చితార్ధమునాడు నీలగవలసినది నాగవల్లిదాకావుండడం నాఅదృష్టమే కదా
నిష్ఠ నీళ్ళపాలు మంత్రం మాలతిపాలు
నీ అరచెతికి పండ్లువస్తే చూస్తాము
నీకు వొకదణ్ణము నీబువ్వకు వొక దణ్ణము
నీకురానిది నాకు యింపుగానిది పాడు
నీకురానిది నేను విననిది పాడు
నీకూనాకూకాదు రోలెత్తి తలంబ్రాలుపొయ్యి
నీకెక్కడ సంశయమో నాకక్కడ సందేహము
నీతిలేనివాడు కోతికంటె పాడు
నీనొసటనే ప్రొద్ధుపొడిచినదా
నీపెండ్లాం ముండమోస్తే నీకెవరన్నం వండిపెడతారు
నీపెండ్లి పాడైనట్లెవున్నది నాపెండ్లికి తాంబూలానికిరా
నీపేరంటమే అక్కరలేదంటే కరకంచు చీరకట్టుకొని వస్తానన్నదిట
నీబర్రె నెవరుకాస్తారు చూతామంటే నాతిత్తిలో డబ్బే కాస్తుందన్నాడట
నీముష్టి లేకపోతే మానెగాని నీకుక్కను కట్తివెయ్యి
నీయెడమచెయ్యి తియ్యి నాపుర్రచెయ్యి పెట్టుతాను
నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
నీలి నీళ్ళకుపోతే బావి లోతుకుపోయిందట
నీలి నీళ్ళకుపోతే బావి లోతుకుపోయిందట
నీళ్లకంఠాయి విద్మహే, కొలుకురాయ ధీమహే, తన్నో గుడ్లూరు ప్రచోదయాత్
నీళ్ళలో నిమ్మలు బ్రతికినవి అడవిలో తుమ్మలు బ్రతికినవి
నీవత్తుపణం పాడుగాను నావొతుపణం కుప్పలు కుప్పలు పెట్టు
నీవు చచ్చిన రోజులేదు నేను యేడ్వనిరోజూలేదు
నీవు తలచినప్పుడు బిడ్డను కనాలనా?
నీవు నొకందుకు పోస్తే నేను మరివక్కంద్కు తాగుతున్నా
నీవు పెట్టకపొతే పెట్టేయిల్లు చూపించు
నీవుకాకపోతే నీఅబ్బ మరివొకడు
నీవుచస్తే లోకమెల్లా యెముకలా
నీసాకులు చట్టుబండలుగాను నాలుగు బేకులు బేకు
నుంటినిబొడిచి శెలగే అనేవాడు
నుయ్యి తియ్యబోతే దయ్యం బయలు వెళ్లింది
నువ్వులూ నూనె ఒకటి, గానుగవాడు వెరు
నూటికి నూలిపోగు, కోటికి గోవుతోక
నూటికిపొడిచి శెలగో అనేవాడు
నూటికిబెట్టి కోటికి గొరిగించేవాదు
నూతికప్పకు సముద్రం చేరువా?
నూనె పోగొట్టుకున్నవాడూ ఏడ్చినవాడు బొండాపకాయ పోగొట్టుకున్నవాడు పొర్లి పొర్లి యేడ్చినాడు
నూనె పోగొట్టుకున్నవాడూ ఏడ్చినవాడు బొండాపకాయ పోగొట్టుకున్నవాడు పొర్లి పొర్లి యేడ్చినాడు
నూరయ్యేవరకు నన్ను కాపాడితే ఆతరువాత నిన్ను కాపాడుతాను
నూరి భరించలేనమ్మ తాగేమి భరిస్తుంది
నూరిమంది మొండి చేతులవాండ్లు పోగయి ఒక గొడ్దు గేదెకు పాలుపితుక లేక పోయినారు
నూరు కల్లలాడైనా ఒకయిల్లు నిలపాలి
నూరు కొరడా దెబ్బలకొక బొబ్బట్టు
నూరు నోములు ఒక రంకుతో సరి
నూరుకాకుల్లో ఒకకోయిల యేమి చేయగలదు
నూరుమంది గ్రుడ్డివాళ్ళు పోగయి ఒక పాడు నూతిలో పడ్డట్టు
నూరుమాటలు ఒక వ్రాతకు సరికావు
నెత్తి మూటకు సుంకమడిగినట్లు
నెయ్యి అని తాగకూడదు, నూనె అని తలకు రాచుగొ కూడదు
నెల తక్కువైనా రాజు యింట పుట్టమన్నట్టు
నేతికుండ నేలబెట్టి వట్టికుండ పుట్టిమీద పెట్టేవాడు
నేతిగూన చేతబూని నిచ్చెన యెక్కేవాడు
నేను పుట్టకపోతే నీకు పెండ్లాము లేకపోను, అంటే, నీను పుట్టకపోతే మీఅమ్మకూతురు పెండ్లాడి వుందునన్నాడట
నేమలికంట నీరుకారితే వేటగానికి ముద్దా
నేరేండ్లు పండితే నేలలు పండును
నేర్చుకున్నదాకా బ్రహ్మవిద్య నేర్చుకున్న తరువాత కోతివిద్య
నేర్పుగలమ్మ నేతితో అతిరసాలుచేస్తే, ఓర్పుగలమ్మ నొళ్ళో కట్టుక ఫోయిందట
నేలకు మూడామడ బిళ్ళపెట్టుగా నదిచేవాడు
నొచ్చిపోయినవాడా నువ్వులు చల్లుము అన్నట్లు
నొయ్యకుండా చేస్తే కోయకుండా పండును
నొసట వ్రాసిన వ్రాలు తప్పదు
నొసటన్ వ్రాసిన వ్రాలుకన్నగలదా నూరేండ్లు చింతించినన్
నొసలు బత్తుడు నోరు తోడేలు
నోటికి చేతికి యెంగిలిలేదు
నోటికివట్టం గంజికి పెడమంట
నోరు మాట్లాడుతూవుంటే నొసలు వెక్కిస్తుంటుంది
నోరుమూస్తేమూగ నోరు తెరిస్తే రాగ
నోరూంబాళపుపండు, చెయ్యి బలుసుముల్లు
న్యాయం తప్పనివాని కాచార్య కటాక్షమెందుకు
నల్లేరుమీద బండిపారినట్లు
నీవుకాకపోతే నీఅబ్బ మరివొకడు
ననాబంత దరిద్రుడు పులిఅంత సాధువు
నిప్పునకాలదు నీళ్ళను తడవదు
Post a Comment