Telugu Samethalu Lettter O(ఒ)
ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికీవోర్చు
ఒంటికిలేని వ్యాధి కొనితెచ్చుకున్నట్లు
ఒక అబద్ధము కమ్మడానికి వెయ్యి అబద్ధములు కావలెను
ఒక కంచానతిని ఒక మంచాన పండుకొనేవారు
ఒక కంట సున్నము ఒకకంట వెన్నయు పెట్టుకొన్నట్లు
ఒక కలకంటే తెల్లవారుతుందా
ఒక కలిమికి యేడిస్తే ఒకకన్ను పోయినది, తనలెమికి యేడిస్తే రెండవకన్ను పోయింది
ఒక చెంప కొట్టితేపాలు ఒకచెంపకొట్టితే నీళ్లు
ఒక చేత పసుపు ఒకచేత ముసుగు
ఒక బర్రె పూసుకొన్నది కాక అన్నిబర్రెలకు పూసెను
ఒక యెరలో రెండుకత్తులిమడవు
ఒకగబెట్టి తాగేది చరచరాకంచరాడు
ఒకచెయ్యి తట్టితే చప్పుడగునా
ఒకటేదెబ్బ రెండేముక్కలు
ఒకటొకటిగా నూరా ఒకేమాటు నూరా
ఒకడు తింటే మరిఒకడు వాంతిచేసుకున్నట్లు
ఒకనాటి భాగవతముతో మూతిమీసాలన్నీ తెగగాలింవి
ఒకనాడు ధారణ ఒకనాడు పారణ
ఒకనాడువిందు ఒకనాడు మందు
ఒకనికి ఇగురుకూరయిష్టము ఒకనికి పులుసుకూరయిష్టము
ఒకపూట తినేవాడు యోగి, రెండుపూటలా తినేవాడు భోగి, మూడుపూటాలా తినేవాడు రోగి
ఒకరిద్దరిని చంపితేగాని వైధ్యుండుగాడు
ఒకవూరికి వెయ్యి దోవలు
ఒక్కకొడుకని ముద్దుగాచూస్తే మిద్దెయెక్కి వెశ్యలను చూచినాడట
ఒక్కకొడుకు కొడుకుకాడు ఒకకన్ను కన్నూకాదు
ఒక్కడి సంపదన పదిమందిపాలు
ఒక్కనాటి భాగవతమునకు ఉన్నమీసాలు గొరిగెనట
ఒక్కప్రొద్దుమాట కుక్కయెరుగునా
ఒక్కొక్కరాయి తీస్తూవుంటే కొండలైనా తరుగుతవి
ఒళ్లు వంగనివాడు దొంగలో కలిసెనాడట
ఒళ్లువంగనమ్మ కాలిమట్టెలకు కందిపోయిందట
ఒళ్లువాచినరెడ్డీ, వడ్లు యేమిధర అంటే అవిలేకనే నా వొళ్లు వాచిందనాడట
ఒళ్లెరుగని శివము మన సెరుగని కల్ల వున్నదా?
Post a Comment