Telugu Samethalu Lettter OA(ఓ)
ఓ కారం రానివాడు వడ్లు గుణించినట్లు
ఓ పనివాడు కోరనిది ఒంటరివాడు ఆడనిది లేదు
ఓ పనివానికి వద్దన్నవారే తల్లి దండ్రులు
ఓచీ ఓచీ నీవు వడ్లుదంచు నేను పక్క లేగ దోస్తాను
ఓడలు బండ్లునా వస్తవి, బండ్ల నోడలవస్తవి
ఓడవగిన కళాసు సామెత
ఓడు ఓడంటే కంచమంతా వోడు అన్నట్లు
ఓరిస్తే ఓరుగల్లు పట్నమౌతుంది
ఓరుగాలిలో దీపంపెట్టి దేముడా నీ మహత్యమన్నట్లు
ఓర్చలేనమ్మ వడిని నిప్పులు కట్టుకుంటే దడీ వడీ కూడా కాలింది
ఓర్చలేని రెడ్డి వుండీచెరచెను, చచ్చీ చెరిచెను
ఓర్చిన పశువుకు తేటనీరు
ఓలి తక్కువని గుడ్డిదానిని పెండ్లాడితే దొంతి కుండలన్నీ పగుల గొట్టినదట
ఓలో సగంచెప్పు నాయనా అన్నట్లు
ఓహో కనుక్కోలేక పోయినా పోయినారుగదా! అన్నట్లు
Post a Comment