Telugu Samethalu Lettter OO(ఊ)
ఊచగల మగవాడు ఊరికిపోతే పెసర ఛేను అడ్డమాయెనట
ఊడుగ విత్తనంవంటివాడు
ఊదకూ డెన్నాళ్ళు ఉద్యోగం యెన్నాళ్ళు
ఊపిరిపట్టితే బొజ్జనిండునా
ఊరంతా నాన్నకువణికితే నాన్న అమ్మకు వణికినట్లు
ఊరంతా వడ్లుయెండబెట్తుకుంటే నక్క తోక యెండబెట్టుకున్నదట
ఊరంతా వూగిముఖము దాసరి తాళ్ళముఖము
ఊరంతాఉల్లి నీవెందు కేతల్లి
ఊరంతాచుట్టాలు ఉట్టికట్టటానికి తావులేదు
ఊరకుంటు, అడవివేడి
ఊరపిచ్చుకకు తాటికాయంత గూద
ఊరపిచ్చుకమీద తాటికాయ ఉంచినట్లు
ఊరపిచ్చుకమీద వాడివజ్రాయుధమా!
ఊరి కేవస్తే మావా డింకొడున్నాడు
ఊరి ముందుకువచ్చి నా పెండ్లాము బిడ్డలు యెట్లున్నారన్నాడట
ఊరించి ఊరించి ఉగాదినాడు బూరిచ్చెనట
ఊరికంతకు ఒకతేబోగముదైతే యెవరివద్ద ఆడుతుంది
ఊరికంతకు ఒకత్రోవ ఉలిపి కట్టెకు ఒకత్రోవ
ఊరికి ఉపకారంగా భార్యము చీరకొనిపెడతాను ఇంటికి డబ్బుయివ్వండి అన్నాడాట
ఊరికిపోయేవానికి లేకపోయినా, బహిర్భూమికి పోయే వానికి భత్యము కట్టుమన్నట్టు
ఊరికే ఉండ లేకపోతే ఉరిబెట్టుకో
ఊరిజబ్బు చాకలి యెరుగును. ఉద్యోగిజబ్బు బంట్రోతెరుగును
ఊరిపిడుగువచ్చి వీరిసెట్టిని కొట్టుకపోయిందే
ఊరిపీడ వీరి శెట్టిని కొట్టినట్లు
ఊరిమీద నూరుపడ్డా, కరణంమీద కాసుపడదు
ఊరివాడికి కాటిభయం పొరుగూరువాదికి నీటిభయం
ఊరివారిబిడ్డను నగరువారుకొట్టితే నగరివారిబిడ్డను నరాయణ కొట్టుతాడు
ఊరు ఉన్నది చిప్పఉన్నది
ఊరు ఉస్తికాయంత సిద్ధాంతం తాటికాయంత
ఊరు పొమ్మంటున్నది కాడురమ్మంటున్నది
ఊరువారి నడ్లపుణ్యాన మా అత్తముడ్డిపుణ్యాన్ని, నాకు నేడు భోజన మమరింది అన్నాడట
ఊరువిడచి పొరుగూరు వెళ్ళినా పూనినఖర్మం మానదు
ఊరేచేరవద్దు రౌతాఅంటే గుర్రాన్ని ఎక్కడకట్టేసేది అన్నాట్ట
ఊళ్ళు యేలే కుమారుడికన్నా ఉపాదానంయెత్తే పెనిమిటి మేలు
Post a Comment