Telugu Samethalu Lettter PA(ప)
పంచాంగం పోతే నక్షత్రాలు పొతవా
పంట పెంటలోనేవున్నది, వాడి వూరిలోనే వున్నది
పండగనాడు పాతమొడుడేనా అంటే, దొరక్క పోతే యేంజేస్తాము అందిట
పండగనాడు పాతమొడుడేనా అంటే, దొరక్క పోతే యేంజేస్తాము అందిట
పండనినేల పుట్టెడు దున్నటంకంటె, పండేనేల పందుంచాలును
పండు జారి పొలాల్లో పడింది
పండుగ తొల్నాడు గుడ్డలకరువు, పండగనాడు అన్నం కరువు, పండగమర్నాడు మజ్జిగకరువు
పండే పంట పైరులోనె తెలుస్తుంది
పంది కేలరా పన్నీరు బుడ్డి
పంది యెంతబలిసినా నంది అవునా
పందికొక్కును పాతర బెట్టితే వుంటుందా?
పందిని నందిని పందిని నందిని చేసేవాడు
పందిలిపడి చచ్చినవాడు యిల్లు విరిగిబ్రతికినవాదు లేరు
పందుంతిన్నా పరగడుపే యేదుంతిన్నా ఏకాదశే
పక్షిమీద గురిపెట్టి మృగాన్ని కొట్తినట్లు
పగటిమాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రచేటు
పగనానింట పదిచిచ్చాలుపోయినా పోయినీవే
పగలు చస్తే పాతకిలేదు, రాత్రిచస్తే దీపానికిలెదు
పగలు పక్క చూచి మాట్లాడు, రాత్రి అదిరద్దు
పగలు రేజీకటి రాత్రి హుటా హుటి
పగలెల్లా బారెడు నేశారు, దీపంతేరా దిగనేస్తాను
పచ్చిగడ్డివెస్తే భగ్గుమంటుంది
పచ్చివెలక్కాయ గొంతున పడ్డట్టు
పట్టపగలు కన్నంవేస్తావేమిరాఅంటే నాకక్కుర్తి నీకేమి తెలుసునన్నట్లు
పట్టపగలు చుక్కలు పొడిపిస్తాడు
పట్టినది చింతకొమ్మగాని ములగ కొమ్మకాదు
పట్టినది బంగారం ముట్టినది ముత్యము
పట్టినవాడు పరక పిల్లంత అంటే పట్టనివాదు మెట్టపిల్ల అన్నట్లు
పట్టిపట్టి పంగనామాలుదిద్దితే గోడదాటున గోకివేసెనట
పట్టివిడిసిన మండ మబ్బువిడచినయెండ మొగుడువిడచిన ముండ
పట్టు కత్తిరించినట్లు మాట్లాడవలెను
పడమట కొర్రుపట్టితే పదిళ్ళమీద రాజనాలు
పడమట కొర్రుపట్టితే పాడియావు రంకివేయును
పడమట మరసిన పదిగడియలకు వర్షం
పడమట మెరిస్తే పందియైనా నీళ్ళకు దిగదు
పడమటకొరడువేస్తే పాడుగుంటలన్నీ నిండును
పడమరకు వూరేడుపిట్టంత మేఘమునడిస్తే పాతాళం బ్రద్దలగునంత వర్షం కురుస్తుంది
పడవ వొడ్దుచేరితే పడవవానిమీద ఒకపొద్దు
పడుకోవడము పాడుగొడ్లల్లో కలవరింతలు మిద్దె యిండ్లల్లో
పడుచుల సేద్యం పాకానికి రాదు
పత్తికి పదిచాళ్లు ఆముదముకు ఆరుచాళ్లు జొన్నకు ఏడు చాళ్ళు
పత్తిగింజ తింటావా బసవన్నాఅంటే ఆహాఅన్నట్లు గంతకట్టనా బసవన్నాఅంటే ఊహూ అన్నట్లు
పదిమంది గలవాడు వందయినా సేద్యం చేస్తాడు
పదిమంది చేసినపని పాదుపాడు
పదిమందితోటిచావు పెండ్లితో సమానము
పదిమందిలోపడ్డ పాము చావకపోదు (చావదు)
పదిరాళ్ళువేస్తే ఒకటైనా తగలదా
పదునుతప్పినా అదును తప్పినా పన్ను దండుగ
పని చెయ్యనివాడు యింటిదొంగ పన్నియ్యనివాడు దివాణానికి దొంగ
పనిఅంటే నావొళ్ళు భారకిస్తుంది భోజనమంటే నా వొళ్లు పొంగివస్తుంది
పనిగల మగవాదు పందిరి నేస్తే కుక్కతోకతగిలి కూలబడేనట
పనిగలవారియింట్లో పైసలఏట్లాట పనిలెనివరియింట్లో పాపొసుల ఏట్లాట
పనితక్కువ పాకులాట యెక్కువ
పనిలెని మాచకమ్మ పిల్లిపాలు పితికిందట
పనిలేక పటేలింటికిపోతే పాతగోడకు వూతపెట్టమన్నాడాట
పనిలేని పాపరాజేమి చేస్తునాడురా అంటే, కుందేటి కుమ్ముకు రేశాలు తీస్తున్నాడు
పనిలేని మంగలి పిల్లితల గొరికినట్లు
పన్నెండామడలమధ్య బ్రాహ్మడుడు లేకపోతే యజ్ఞం చేయిస్తానన్నట్లు
పప్పణ్ణంఅంటే పది ఆమడలైనా పరుగెత్తాలె
పప్పుతో పది కబళాలూ తింటే వులుపెందుకు బుగ్గిలోకా
పప్పులేని పెండ్లి పప్పులేని కూరవున్నదా
పరమేశ్వరుడు కన్ను విప్పితే కాలమేఘాలు కకాలికవైపోతాయు
పరాయి పిల్లలకు గాజులు పెట్టితే పకాలుచేటు
పరుగెత్తుతూ పాలుతాగెకన్న నిలబడి నీళ్లు తాగేదిమేలు
పరుగేత్గ్తేవాణ్ణి చూస్తే తరిమేవాడికి లోకువ
పరులసొమ్ము పేలపిండి, తనసొమ్ము దేవుడిసొమ్ము
పలకమ్మ పున్నానికి (మార్గశిరము) పడమటి కొమ్మ పూస్తుంది
పలుకనివాళ్ళతో పదివూళ్ళవాళ్లూ గెలువలేరు
పల్లం వుంటే నీళ్ళు నిలుస్తవి
పల్లందున్నినవాడు పల్లకీ యెక్కినవాడు సమము
పల్లికమ్మగడుస్తే (మార్గశిర పూర్ణిమ) తల్లితోకలుస్తాను
పశువులకు పాలు నోటిలోవున్నవి, పాలు కాచేవాడు పాటుకు అక్కరకురాడు
పసుపుకొమ్ము యివ్వని కోమటి పసారమంతా కొల్ల యిచ్చినాడు
పసుపూ బొట్టూపెట్టి పెండ్లికి పిలిస్తేపోక, పెంకుపట్టుకొని పులుసుకు వెళ్లినట్లు
పాండవుల వారిసంసధ్యం, దుర్యోధనుల వారి పిండాకుళ్లకు సరి
పాగావంటి బంధువుడు అంగరకావంటిహరంగాడు లేరు
పాటిమీద గంగానమ్మకు కూటిమీదే లోకం
పాటు గలిగితే కూటికి కొదవా
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి
పాడిఆవును దానంచేసి పాలు తానే పిరుక్కున్నట్లు
పాడిపసరము, పసిబిడ్డ ఒక్కటే
పాడు వూళ్లో పొగిడేవారు లేరు నాకు నేనే పొగుడుకుంటాను
పాడూరికి మచముకొయ్య పోతరాజు
పాత దొంగ వొక్కరోజు పట్టుబడక మానడు
పాతముండ కలవరిస్తే కొత్తముండకు దెయ్యం పట్టినట్లు
పాతముండ లందరు పోగయి కొత్తముండ తాడు తెంచినట్లు
పాన్పు మంచిదిచూచి పసరము కొట్టవలెను
పాపంవుంటే భయం, పల్లంవుంటేనీళ్లు
పాపటకాయ కొరకనెంత యాక నెంత
పాపనము పదిసేద్య్హాల పెట్టు
పాపమని పల్లెడంబలిపోస్తే కారంలేదని కచ్చేరికెక్కెనట
పాపాలులేవు పుణ్యాలులేవు తరిమితేచెట్లపాలు గుట్లపాలు
పాపిసొమ్ము పరులపాలు ద్రోహిసొమ్ము దొరలపాలు
పాము చిన్నదైనా దొకటే పద్దదైనా వొకటే
పాముకు పాలుపోస్తే విషమైనట్లు
పాముతో చెలిమి కత్తితో సాము
పాముతో చెలిమి రాజుతో చెలిమి వొకటి
పామునకు విషము పండ్లతో వుంటుంది
పామును ముద్దుపెట్టుకున్నట్లు
పామునూ చాననివ్వడు, కర్రా విరగనివ్వడు
పాములతో మెలగవచ్చును గాని స్రాములతో మెలగ రాదు.
పాయసములో నెయ్యి వొలికినట్లు
పారవేసుకున్న చోటనే వెతుక్కోవలసినది
పారే చీమ చప్పుడు వినేవాడు
పాలకువచ్చి ముంత చాచినట్లు
పాలచుట్తితే మాత్రం మేలుగుణం వస్తుదా
పాలను చూడనా భాండాన్ని చూడనా
పాలల్లో పంచదార వొలికినట్లు
పాలిచ్చే బర్రెనుపోగొట్టుకొని పైనెక్కేదున్నను తెచ్చుకున్నట్లు
పాలుచిక్కనైతే వెన్న నెక్కసం
పాలుపోసి పెంచినా పాము కరవకమానదు
పాలేకుడిచి రొమ్మే గుద్దినాడు
పాలేదు దున్నినవాడు అప్పులపాలు
పాలేరు వాని పశువుపోయినాల్ మారుతల్లి బిడ్డపోయినా బెంగలేదు
పిండిఎంతో నిప్పటి (రొట్టె) అంతే
పిండిప్రోలూలేనిది పెండ్లిఅగునా
పిండిబొమ్మనుచేసి పీటమీద కూర్చుండపెట్టితే ఆడబిడ్డల్ తనాన అదిరి పడ్డదట
పిచ్చికుదిరింది రోలు తలకు చుట్టమన్నట్లు
పిచ్చివానికి లోకమంతయు పిచ్చగానె యుంటుంది
పిచ్చుకమీద బ్రహ్మాస్త్రమా
పిచ్చుగుంటలవాని పెండ్లెంత వైభమెంత
పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినది
పిఠాపురంవెళ్ళి పిడికెడు నీళ్ళు తెచ్చినట్లు
పిడుకలు తీసుకురార సివ్వయంటే నాపిక్కలు నొస్తున్నవి అవ్వా అన్నాడట
పిడుకిపొగకు సిగమూగితే గుగ్గిలంపొగ కెట్లాగనలె
పిడుక్కూ బియ్యానికి వొకటే మంత్రం
పిత్రార్జితం అంతా కరారావుడి చుట్టటం అయింది
పినతండ్రి పెళ్ళాం పినతల్లి గాదు, మేనమామ పెళ్లాము మేనత్తగాదు
పిరికి బంటుకు ఆయుధ మెందుకు
పిరికిఅంటూ రానేగూడదుగాని వచ్చిందంటే పిచ్చికుక్క కరచినట్లే
పిలవని పేరంటం, చెప్పని ఒక్కపొద్దు
పిలిస్తే బిగిస్తే సరిగాని వస్తే వాడబ్బతరమా
పిల్చేవారుంటే బిగిసేవారు శానామంది
పిల్ల కోసరం గడ్డి తింటాడు
పిల్ల బావిలో పడ్డదిరా అంటే వుదుకంబలి తాగిస్తా నన్నాడట
పిల్ల ముడ్దిగిల్లి వుయ్యాల వూపేవాడు
పిల్ల లేనియింట తాత తడువు లాడినట్లు
పిల్లకా కేమెరుగును వుండేలు దెబ్బ
పిల్లకాయలకు పీట కోళ్లకు చలిలేదు
పిల్లకు సొమ్ముబెట్టిచూడు గోడకు సున్నం పెట్టిచూడు
పిల్లగలవాడు పిల్ల కేడిస్తే కాటివాడు కాసుకేడిచినట్లు
పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు గలుగ గోరును
పిల్లి కండ్లు మూసుకొని పాలు త్రాగుతూ ఎవరున్నూ చూడలేదను కొన్నట్లు
పిల్లి బ్రాహ్మణుడు, పీట ముత్తైదు
పిల్లి శాపాలకు ఉట్లు తెగునా
పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము
పిల్లికి రొయ్యల మొలత్రాడు గట్టితే అసుంటాబోయి నోట్లో వేసుకున్నదట
పిల్లితోక బర్రె త్రొక్కితే పిల్లి ఎలుక మీద మీసాలు దువ్వెనట
పిల్లిని చంక బెట్టుకొని పెండ్లికి వెళ్ళినట్లు
పిల్లిని చంపిన పాపం నీది బెల్లం తిన్న పాపం నాది
పీతాంబరం ఎరువిచ్చినమ్మ పీటవెంబడి పెట్టుకు తిరుగ వలసినది
పీనుగుకు ఎక్కదో గద్దలక్కడ
పుంజం పెట్టినది బట్ట లంచం పెట్టినది మాట
పుంటికూరతిన్న పుట్టినిల్లు పాశముతిన్న పరాయియిల్లు
పుంటిశూరలో పుడక రుచి మాంసములో బొక్కరుచి
పుంటిశూరలో పుడక రుచి మాంసములో బొక్కరుచి
పుచ్చకాయల దొంగ అంటే బుజముతడవి చూచుకున్నట్లు
పుచ్చిన వంకాయలు బాపనయ్యకు
పుచ్చిన విత్తనాలు చచ్చినా మొలవవు
పుట్టకు ధ్వనియెత్తితే పట్టేడు మొగుడికి ద్వానెత్తితే పుట్టేడు
పుట్టనిబిడ్డకు పూసలు కట్తినట్లు
పుట్టనిబిడ్డకు పేరు పెట్టినట్లు
పుట్టమన్ను వేసిన పుడమి పండుతుంది
పుట్టమీద తేలుకుట్టినా నాగుమయ్య మెహిమేనా
పుట్టించినవాడు పూరిమేవుతాడా
పుట్టినన్నాళ్ళకు పురుషుడు యజ్ఞముచేసెను
పుట్టినపిల్లలు బువ్వకే'డిస్తే అవ్వ మొగుడు కేడ్చినట్లు
పుట్టినవానికి తమ్ముడు పుట్టేవానికన్న
పుట్టిన్నాటినుంచీ వుల్లిగాడే మొగుడా
పుట్టిన్నాటిబుద్ధి పుడకలతోగాని పోదు
పుట్టుచాయెగాని పెట్టుచాయ్వచ్చునా
పుట్టువాసనా పుట్టుశాస్త్రుల్లా పెట్టుశాస్త్రుల్లా
పుట్టెడాముదాము పట్టించుకొని దొర్లినా అంటదుశిరి
పుణ్యం పుట్టేడు పురుగులు తట్టేడు
పుణ్యానికి పుట్టేడిస్తే పిచ్చకుంచమన్నట్లు
పుణ్యానికి పెట్టేఅమ్మా నీమొగుడితో సమానంగాపెట్టు
పుత్రుడై వేధింతునా శత్రుడై వేధింతునా పేరులెని దయ్యమునై వేధింతునా పెనిమిటినై వేధింతునా
పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడుపిట్ట అడుగైనాతడియదు.
పుబ్బ రేగిగినా బూతురేగినా నిలువదు
పుబ్బకెరలితే భూతం కెరలినట్లు
పుబ్బలొ పుట్టి మఖలో మాడిపోయింది
పుబ్బలో చల్లేదానికంటె దిబ్బలో చల్లేది మేలు
పుబ్బలో పుట్టెడు చల్లేకంటే దిబ్బలో మఖలో మానెడు చల్లితే మేలు
పుబ్బలోపుట్టెడు చల్లేకంటే ఆశ్లేషలో అడ్డెడుచల్లేది మేలు
పురిట్లోనే నందు కొట్ఘ్టింది
పురుగు గిరుగుంతిని పుట్టలో నుండక యూరివార్తలన్ని యుడుము కేల
పురుష సింహుడైతే పురుషుణ్ణే పెండ్లాడవలెగాని స్త్రీని పెండాడడమెందుకు
పుర్రు కారుతూవుంటే పోతరాజు శివమాడినట్లు
పులగంమీదికి తేడ్డెడుపప్పు
పులికడుపున చలిచీమలు పుట్టునా
పులికాకలైతే గడ్దితింటుందా
పులిని చూచి నక్క వాతపెట్టుకున్నట్లు
పులిపక్కను జోరీగవున్నట్లు
పులిపిల్ల పులిపిల్లే మేకపిల్ల మేకపిల్లే
పులిమీసాలుపట్టుకు వుయ్యాలలూగినట్లు
పుష్యమాసమునందు పువ్వులుగుచ్చ పొద్దుండదు
పుష్యమాసానికి పూసంతవేసంగి
పూచిన పూవెల్లా కాయాఐతే భూమిపట్ట చోటుండదు
పూచినతంగేడు వేసినా కాసినవెంపలి వేసినా నేను వండుదును
పూజకొద్దీ పురుషుడు పుణ్యంకొద్దీ పుత్రుడు
పూటకూళ్ళకు వచ్చినవాడికి పుట్లధర యెందుకు
పూతకుముందే పురుగుపట్టినది
పూరా మణిగిన వానికి చలేమి, గాలేమి
పూలమ్మిన చోట పుడక లమ్మినట్లు
పూలమ్మిన చోట పుడక లమ్మినట్లు
పూస పోగూ వుంటే బుజమెక్కవలెనా
పెండ్లి మర్నాడు పెండ్లికొదుకు ముఖాన పెద్దమ్మ వ్రేలాడుతుంది
పెండ్లికి పోదాం అంటే వెళ్లిపోదాం అన్నట్లు
పెండ్లినాటి సౌఖ్యం లంఖణాలనాదు తలచు కొన్నట్లు
పెండ్లివారు వచ్చి పెరట్లో దిగినారా
పెండ్లిస్ందట్లో తాళిబొట్తు కట్ట మరచినట్లు
పెక్కురేగుల్లో ఒకజిల్లేడు బ్రతుకునా
పెట్టకూస్తే పుంజు కేరుతుంది
పెట్టగల బచ్చలిపాదు కొనగల కట్ట మరచినట్లు
పెట్టనమ్మ పెట్టనెపెట్టదు పెట్టేముండ కేమి వచ్చినది పెద్దరోగం
పెట్టితే తింటారు గాని తిట్టితే పడరు
పెట్టితే పెండ్లి పెట్టకపోతే శ్రార్ధము
పెట్టినదంతయు పైరగునా? కన్నదంతయు కాన్పగునా
పెట్టినమ్మకు ప్రాణహాని చెప్పినమ్మకు జన్మహాని
పెట్టినమ్మకు ప్రాణహాని చెప్పినమ్మకు పుట్టనిదేసాక్షి
పెట్టినవారికి తెలుసు నిక్షేపం
పెట్టీపొయ్య నమ్మ కొట్టి పొమ్మన్నదట
పెట్టీపొయ్య నమ్మ కొట్టి పొమ్మన్నదట
పెట్టే పోతలు లేని వట్టి కూతలేల
పెదిమ దాటితే పెన్నదాటుతుంది
పెదిమకు మించిన వళ్లు, ప్రమిదకు మించిన వత్తి
పెద్ద తలలేకపోతే గొర్రెతల తెచ్చుకోమన్నారు
పెద్ద బావగారు ఆడంగులతొ సమము
పెద్దకొడుకు పెంద్లి అసుర భోజనము
పెద్దపులి యెదుటైనా పడవచ్చునుగాని నగిరివారి యెదుట పడరాదు
పెద్దయింటి బొట్టె అయినా కావలె పెద్ద చెరవు నీరు అయినా కావలె
పెద్దల మాటలు పెరుగన్నముతో సమానము
పెద్దలకు పెట్టరా పేచీలతలపాగ
పెద్దలతొవదు పితరులతో పోరు
పెద్దలమాటలు పెరుగుచద్దులు
పెద్దలవుసురు పెనుబామై కరచును
పెన్నరావడం వెన్నకరిగేలొపల
పెన్నలోమాన్యం చెప్పెనట్లు
పెరగగా పెరగగా పెదబావగారు పండుకోతయినట్లు
పెసరకుపరుగాలి పసరమునకు నోటిగాలి ప్రమాదకరములు
పేగుగంగానమ్మ తాగబోతే నీళ్ళు లేవు
పేగుచుట్టమా పెట్టుచుట్టమా
పేదబ్రతుకు గోధుంరొట్టె అద్దుకతిన ఆవునెయ్యి మూతి కడుగ నేతిబొట్తు
పేద్దపులి తరుముకు వచ్చినా హజారం ముందుకుపోరాదు
పేనుకు పెత్తనంయిస్తే తలంతా తెగకొరికినది
పేనుకుక్కినా కుక్కుతాడు చెవికరచినా కరుస్తాడు
పేరంటానికివచ్చి పెండ్లికొడుకు వరుసయేమి అన్నట్లు
పేరు పల్లకీమీద కాలు నేలమీద
పేరు పెనిమిటిది అనుభవం మామగారిది
పేరు పెన్న మేసింది వేళ్లు నేలమోసింది
పైకంలేనివాదు పరస్త్రీవర్జితుడు
పైకము భాగవతపువారికి తిట్లు చాకలి మంగలివారికి
పైనపారే పక్షి క్రిందపారే చీమ
పైపడ్డమాట మడిపడ్డనీళ్లూ పోతవా
పైపెట్టుగా వర్షించిన పైరు పగవానిముఖమూచూడరారు
పైరుకుముదురు పసరమునకు లేత
పైరుగాలికి ప్రత్తిచెట్టు ఫలించును
పైరుపెట్టక చెడిపోవడముకంటే పైరుపెట్టి చెడిపోవడం మేలు
పొక్కటిరాళ్ళకు పోట్లాడినట్లు
పొట్టకంకులు తిన్నవారికి వూచబియ్యం లేవు
పొట్టకు పుట్టెదురిని ఆట్లకు ఆదివారం
పొట్టపైరుకు పుట్టేడు నీరు
పొట్టివాడికి పుట్టేడు బుద్ధులు
పొట్టివానినెత్తి పొడుగువాడు కొట్టె పొడుగువాని నెత్తి దేముడు కొట్టె
పొత్తులమగడు పుచ్చిచచ్చెను
పొత్తులమగడు పుచ్చిచచ్చెను
పొదుగు చింపిన పసరం పోతును యీనుతుంది
పొదుగుకోసి పాలుత్రాగినట్లు
పొయ్యి వూదినమ్మకు బుక్కెడైనా దక్కదా
పొయ్యివూదమంటే కుండలు బ్రద్దలు కొట్టినాడు
పొరుగింటచూడరా నాపెద్దచెయ్యి
పొరుగింటి కలహము విన వేడుక
పొరుగు పచ్చగావుంటే పొయ్యిలోనీళ్లు పోసుకున్నట్లు
పొరుగూరి చాకిరం పొరుగూరి వ్యవసాయం తనను తినేవే గాని తినేవిగావు
పొర్లించి పొర్లించి కొట్టుతూవుండగా మీసాలకు మన్నుతగుల లేదన్నట్లు
పొలములో పొలము స్తలములోస్తలము
పొల్లుదంచి బియ్యము చేసినట్లు
పోగాపోగా పైగుడ్డ బరువవుతుంది
పోతేపల్లివారికి పప్పే సంభావన
పోతేపల్లివారికి పప్పే సంభావన
పోరాని చోట్లకు పోతే రారానిమాటలు వస్తవి
పోరానిచుట్టంవచ్చాడు బొడ్దువంచికోయరా తమలపాకులు
పోరినపొరుగు రాసినకుండలూ మనవు
పోరులెనిగంజి పోసినం తేచాలు
పోలిగాడిచెయ్యి బొక్కనుపడ్డది
పోలీపోలీ నీబోగం యెన్నాళ్ళేఅంటే మాఅత్త మూలవాడనుండివచ్చేవరకు అన్నదట
పోల్నాటిలో పోకకుపుట్టెడు దొరికితే ఆపోకదొరకక పొర్లిపొర్లి ఏడ్చిందట
పౌయ్యిఅరిస్తే బంధువులు కుక్క అరిస్తే కరువులు
ప్రతిష్ఠకు పెద్దినాయుడువస్తే యీడవలేక యింటినాయుడు చచ్చినట్లు
ప్రయాణంఅబద్ధం ప్రసారం నిబద్ధి
ప్రసూతివైరాగ్యం పురాణవైరాగ్యం శ్మశానవైరాగ్యం
ప్రాణంపోయినా మాసందక్కించుకోవలెను
ప్రాతబడ్డబావినీరు మేకలపాడి రోత
ప్రాతస్సంధ్యావందన అర్ధహృదయపాఠ అర్ధపుస్తకపాఠ మధ్యాహ్న సంధ్యావందన నమ్మకు తెలియదు నమ్మఆచారి తెలియదు సాయంసంద్యావందన యధోచితం
ప్రీతితోపెట్టింది పిడికెడేచాలు
ప్రొద్దుటిది పొట్టకు మాపటిది బట్టకు
పడుచుల కాపురం చితుకులమంట
పల్లికమ్మగడుస్తే (మార్గశిర పూర్ణిమ) తల్లితోకలుస్తాను
పాలుచిక్కనైతే వెన్న నెక్కసం
పితికేబర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లు
పిల్లికి రొయ్యల మొలత్రాడు గట్టితే అసుంటాబోయి నోట్లో వేసుకున్నదట
పుణ్యానికి పోతే పాపమెదురైనది
పులికడుపున చలిచీమలు పుట్టునా
పెట్టు చుట్టము పొగుడు భాగ్యము
పొదుగు చింపిన పసరం పోతును యీనుతుంది
పోయిన కంటికి మందువేస్తే వున్నకన్ను వూడ్చుకొని పోయింది
`పుచ్చిన మిర్యాలైనా జొన్నలకు సరితూగక పోవు
l పలుచని పంట వేడుక, బత్తుచూపు వేడుక
O పాటిమీద వ్యవసాయం కూటికైనా రాదు
ఫట్టణము పోయిన గాడిదె పల్లెకుపోయిన గాడిదను కరచినదట
Post a Comment