Telugu Samethalu Lettter RA(ర)
రంకాడనేర్చినమ్మ బొంకాడనేరదా
రంభచెక్కిలిగొట్టి రాత్నందెచ్చినట్లు
రత్నమురుప్పి గాజునుకోరినట్లు
రత్నాలన్నీ ఒక చోట నత్తగుల్లలన్నీ ఒక్కచోట
రత్నాలుతినే పక్షికి రత్నాలు, రాళ్లు తినే పక్షికి రాళ్లు
రాగంరానివాడు రోగంలెనివాడు లేడు
రాగలశని రామెశ్వరంపోయినా తప్పదు
రాగానకునేను అందానకు నాఅప్ప
రాచపీనుగు తోడులేకుండా చావదు
రాజా టెంకాయపుచ్చు కోండి మా అన్న గార్కి సభాకంపం
రాజాంకాయ పిచ్చికొండ యానున్న గార్కి సభాకంపం
రాజాంకాయ పిచ్చికొండ యానున్న గార్కి సభాకంపం
రాజు మెచ్చిందిమాట మొగుడు మెచ్చింది రంభ
రాజు రాకడ లేదు త్రొవనూకుడూ లేదు
రాజుచేసిన కార్య్హాలకు రాముండుచేసిన కార్యాలకు యెన్నికలేదు
రాజునకుకంటను పామునకు పంటను విషముండును
రాజుననుసరించి ప్రజయుందురు
రాజును జూచిన కంట మొగుణ్ణిచూస్తే మొట్ట బుద్ధి అయినది
రాజుభార్య మేడయెక్కితే కుమ్మరివాని కోడలు గుడిసెయెక్కింది
రాజులేని వూళ్ళు పూజలెనిగుళ్లు
రాజ్యాలుచెడ్డా లక్షణాలు చెడలేదు
రాటంవచ్చె బండేతీయి దారిలో
రాతివిగ్రహమునకు జక్కిలించ పెట్టినట్లు
రాత్రిపడ్డ గోతులో పగలుకూడా పడనా
రానివానిమీద రాయి రామరాజ్యం
రామయణం రకు, భారతం బండు, భాగవతం బొంకు
రామాయణమంటే యేమో అనుకున్నాను గాని మనిషి బరువుందన్నాడట
రామాయణమంతా విని రాముడికి సీత యేమి కావాలన్నట్లు
రామునివంటి రాజువుంటే హనుమంతునివంటి బంటు వుంటాడు
రామేశ్వరంపోతే శనేశ్వరం యెదుగుగుండా వచ్చినది
రాయిగుద్దనేల చెయ్యినొవ్వనేల
రాలరువ్వ తగినవానిని పూలరువ్వరు
రాళ్ళచెనికి గుంటక తోలినట్లు
రాళ్ళు దొర్లించినట్లు మాట్లాడుతాడు
రాష్ట్రందాగినా రంకు దాగదు
రూపాయబిళ్ళ చంద్రబింబంలాగ చెయిజారినట్లు
రెండుకండ్లుండి నరకంలో ప్రవేశించే కంటె ఒక్కకన్నుండి స్వర్గంలో ప్రవేసించేది మేలు
రెండుకండ్లూ పోయెను నోటిలో మన్నుపడె నన్నట్లు
రెండేండ్లయెండు మూడేండ్ల మురుగు
రెక్కలు విరిగిన పక్షి వలె ఉన్నాడు
రెడ్డివచ్చె మొదల్లడుమన్నట్లు
రేగుచెట్టుక్రింద చెవిటి, గృడ్డివాని వత్తు
రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయము
రొట్టె విరిగి నేత బడ్డట్టు
రొట్టెల వానికంటె తునకలవాడు ఘనుడు
రొట్టెలేదు గాని నెయ్యివుంటే అద్దుకుతిందును
రొట్టే తగువు కోతి తీర్చినది
రోకటికి చిగురు పట్టినట్లు
రోగీ పాలేకోరినాడు వైధ్యుడూ పాలే కోరినాడు
రోట్లో బుర్రపెట్టి రోకలి దెబ్బకు వెరచినట్లు
రోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టు కున్నట్లు
రోషములేని బంటుకు మోసము లేదు
రోషానకు రోలు మడకు కట్టు కున్నట్లు
రోహిణి యెండకు ఱోళ్ళు పగులును
రౌతు మెత్తనైతే గుఱ్ఱము మూడు కాళ్ళతో నడుచును
Post a Comment