శంఖంలో పోస్తే తీర్ధము పెంకులో పోస్తే నీళ్లు
శంఖలో పోస్తేగాని తీర్ధంకదు
శతడబ్బు సహస్రడబ్బు
శనగలు తిని చేయి కదుకున్నట్లు
శని విరగడ పని వొబ్బిడి
శనివారపు వాన శనివారమే పోతుంది
శరణార్ధిని లింగప్పా అంటే కందులు మూడు మాడలన్నాడట, చిన్నా పెద్దా బాగున్నారా అంటే పప్పులక్కవలె వుడుకుతుం దన్నాడట
శల్య సారధ్యం
శవానికి చేసిన అలంకారం
శాస్త్రుల్ల వారింట బుట్టి, సోమయాజుల వారింట జొచ్చి లవణమంటె దూడ రేణవని యెరుగనా
Post a Comment