Telugu Samethalu Lettter TA(త)
తంటాలమారి గురానికి తాటిపట్ట గొరపం
తండ్రి తవ్విన నుయ్యి అని అందులో దూకవచ్చునా
తండ్రిని చంపిన పాపం అత్తవారింట అంబటికట్ట తెగితే పోతుంది
తండ్రిసేద్యం కొడుకు వైద్యం, కూడుమధ్యం
తంబళి తన లొటలొటేగాని యెదుటివారి లొటలొట యెరుగడు
తక్కువ నోమునోచి యెక్కువఫలము రమ్మంటేవస్తుందా
తగవరి కూలికి విషము త్రాగడు
తగవున నోడినను ముదిమిని చచ్చినను బందిలేదు
తగినట్లే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
తగినట్లే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
తగుదాసరికే మెడపూసలకు, అమ్మకన్న కాంపుకూ, అయ్య యిచ్చిన మునుముకూ సరి
తడక లేని యింటిలోకి కుక్క దూరినట్లు
తడిగుడ్డతో గొంతుక కోస్తాడు
తడిసి ముప్పందుము మోసినట్లు
తడిసిన కుక్కి బిగిసినట్లు
తడిసినగాని గుడిసె కట్టదు తాగిగాని మొగ్గడు
తణుకుకుపోయి మాచవరం వెళ్ళినట్లు
తద్దినం కొని తెచ్చు కున్నట్లు
తన చెయ్యి కాలుతుందని సవతిబిడ్డచేతితో కలియబెట్టినట్లు
తన తలుపుతీసి పొరుగింటికి బెట్టి రాత్రంతా కుక్కల తోలుతూ కూర్చున్నట్లు
తనకంపు తనకింపు పరులకంపు ఓకరింఫు
తనకచ్చా తానుకట్టుకుని సానికొంపను తిరిగినాతప్పులేదు
తనకలిమి యింద్రభోగము తనలేమి లోకదారిద్రము
తనకాళ్ళకు బందాలు తానే తెచ్చుకున్నట్లు
తనకు అని తెవ్వెడు వుంటే ఆకటివేళ ఆరగించ వచ్చును
తనకు కానిరాజ్యం పండితేనేమి వదటకలిస్తే నేమి
తనకు చెప్ప తడికలచాటు ఒకరికిచెప్ప ఒప్పలకుప్ప
తనకు తెలిసినవన్నీ తలగడ చెప్పేటట్టుంటే తగిన వాళ్లెందరో తలవంచుకోవలసి వస్తుంది
తనకు బాసిన వెంట్రుకలు యే రేవులో పోతేనేమి
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం
తనకొంగునవున్నరూక తనకు పుట్టినబిడ్డ పనికివస్తవి
తనతల్లిచావుకన్నా పినతల్లిచావుమేలు
తనదాకావస్తే గాని తలనొప్పి బాధతెలియదు
తనదీపమని ముద్దుపెట్టుకుంటే మూతిమీసాలుకాలును
తననుపొడిచిన గంగిగోవునైనాపొడిస్తే పాపంలేదు
తనపిల్ల తవిటికేడిస్తే లంజపిల్ల రాగిరేకు కేడ్చినది
తనపుట్టి పిచ్చగావుంటే, పొరుగు పందుం సరాకొలిచి నాడట
తనబంగారం కాకపొతే వన్నెలేదు మెరుపు లేదు
తనబలిమికన్నా స్థానమలిమిమేలు
తనముడ్ది కాకపోతే గంగదాకా తాటిపట్టికెదురు దేకమన్నట్లు
తనముడ్దికాకపోతే కాశీదాకా దేకమన్నట్లు
తనయుని పుటక తల్లికి తెలుసు
తనలొ తప్పులెకుంటే గురువుతో గుద్దులాడవచ్చునట
తనవారిని యెరగని మొఱ్ఱితెడ్డు ఉన్నదా
తనవారు లోతుకుతీతురు కానివారు కడకు తీతురు
తనవాసితప్పితే ఒకవన్నె తరుగును
తనువులు నిత్యములేదుగాని ఓలిపైకము ఖర్చుపెట్టకు అన్నట్టు
తన్నుగట్టతాళ్లు తానేతెచ్చుకొనినట్లు
తన్నేకాలుకు రోలు అడ్డమైనట్లు
తప్పులులేనివారు ధరణిలోలేరు
తప్పులువెతికేవాడు తండ్రితప్పులు వెతికేవాడు ఓర్వలేనివాడు
తప్పులేనివాణ్ణి ఉప్పులోవూరయ్య మన్నాడట
తప్పూఒప్పూ దైవమెరుగును పప్పూకూరబాపడెరుగును
తప్పెటకొట్టినవాడు దాసరి శంఖంవూదినవాడు జంగం
తమరాకులో నీళ్లు తల్లడించినట్లు
తమామూలేకుంటే తవ్వెడైనా అడిగినట్లు
తమ్ముడు తనవాడేగాని తప్పుతనదా
తరిఅంటే వరిఅంటాడు తిరిగిఅంటే గొంతుకు ఉరి
తలంటబలగమేగాని తలకుపెట్టేవారు లేరు
తలకాయలోకిదూర్చిన తాబేలువలె
తలకోసి ముందరపెట్టితే గారడీవిద్యాన్నట్లు
తలకోసుకపోగా పోగులకు యేడ్చినట్లు
తలతడిసినమట్టుకు గొరిగే తీరవలెను
తలతిరిగియైనా కబళం నోట్లోకే రావలెను
తలతోకలెని కధ ముక్కుముఖములేనిపిల్ల
తలలు బోడులైనా తలుపులుబోడులా
తలుపులుమింగేవానికి అప్పడాలు లొటలొట
తల్లికడుపులో చొరకముందు దయ్యాలదేవత భూమిలో పుట్టినతర్వాత దయ్యాల దేవత
తల్లికికానివాడు దాయాదికౌనా
తల్లికికూడు పెట్టనివాడు తగుదునమ్మా అనితీర్చవచ్చినట్లు
తల్లికితగినబిడ్డ యింటికితగిన వందిలి
తల్లిగండము పిల్లగండము మంత్రసానిగండమున్నదా
తల్లిచనిపోతే తండ్రి పైనతండ్రితో సమానము
తల్లిచాలు పిల్లలకు తప్పుతుందా
తల్లిచెఫులు మద్దికాయలు దండుగలకు పెండ్లాంమెళ్ళో పూసలు భోగాలవారికి
తల్లిచెవులకన్నా పినతల్లిచెవులు మేలు
తల్లిచెవులు తెంచినవానికి ముత్తవచెవులు వెంట్తుక మాత్రం
తల్లిచేసే కడుపుపెద్ద, తలమాస్తే కొప్పుపెద్ద
తల్లిదే వలపక్షం ధరణిదే వలపక్షం
తల్లినిచూచి పిల్లనూ పాలనుచూచిబర్రెను కొనవలెను
తల్లినినమ్మినవాడు ధరణిని నమ్మినవాడు చెడడు
తల్లినిబట్టి పిల్ల, విత్తునుబట్టి పంట
తల్లిపుట్టిల్లు మేనమామవద్ద పొగడినట్లు
తల్లిబంగారైనా కంసాలివాడు దొంగిలకమానడు
తల్లియైనా పిల్లయేడవంది పెట్టదు
తల్లిరోసినపిల్లను దాదిరోయదా
తల్లిలేనిపిల్ల వుల్లిలేనికూర
తల్లీబిడ్డావకటైనా నోరూ కదుపూ వేరు
తవిటికివచ్చిన చెయ్యే ధజమునకు వస్తుంది
తవుడుకు వచ్చినచెయ్యి డబ్బుకూవస్తుంది
తవ్వగాతవ్వగా తధ్యం తేలుతుంది
తా దిన తవుడులేదు వారాంగనకు వడియాలు
తాకోటుగాడికి దధ్యన్నము విశ్వాశికి వేణ్ణీలన్నము
తాగనేరనిపిల్లి బోర్లదోసుకున్నట్లు
తాగబోతూ బొల్లియెద్దుకుకుడితి
తాగబోతే దప్పిగలేదు తలకొక అంటికలి
తాగేది దమ్మిడీగంజాయి యిల్లంతా చెడువుమ్ములు
తాగేవాడే యిచ్చుకుంటాడు తాళ్ళపన్ను
తాచెడ్డకోతి వనమెల్లా చెరచినది
తాటాకు తినెదవా తలకొట్లుపడెదవా
తాటాకుచప్పళ్లుకు కుందేళ్లు బెదురునా
తాటిచెట్లలో ప్రొద్ధుగూగినట్లు
తాటిపట్టెకు యెదురు దేకినట్లు
తాడనియెత్తి పారవేయనూగూడదు పామని దాటనూ గూడదు
తాడు అని యెత్తిపారవెయ్యనూ కూడదు పాము అని దాటనూ కూడదు
తాడుచాలకపోతే నుయ్యిపూడిచినట్లు
తాడుచాలకపోతే నుయ్యిపూడిచినట్లు
తాడెక్కేవానికి తలదన్నవాడుండును
తాడేక్కేవానిని యెంతవరకు యెగసనదోయవచ్చును
తాతకు దగ్గులు నేర్పినట్లు
తాతా పెండ్లాడుతావా అంటే నాకెవడిస్తాడురా అన్నట్లు
తాతా సంక్రాంతి పట్టు పట్టు
తాతా సంధ్యవచ్చునా అంటే యిప్పుడు చదువుకున్న నీకు రాకపొతే
తాతాచార్యుల ముద్ర భుజము తప్పినా వీపు తప్పదు
తాదినతౌడులేదు వానికిఒక పందిపిల్ల
తాననుభవించని అర్ధం ధరణిపాలు
తానిచేసిన పాపం తనువుతో తల్లిచేసినపాపం ధరణికో
తాను పతివ్రతయైతే బోగమింట కాపురముంటే నేమి
తాను బోను త్రోవలేదు మెడకొకడోలు
తాను మింగేది తనను మింగేది చూడవలను
తానుండెది దాలిగుంట తలచేవి మేడమాళిగలు
తానుపట్టిన కుందేటికి మూడే కాళ్ళు
తానుపట్టిన కోడికి నాలుగు కాళ్ళు
తానుపెంచిన పొట్టేలు తన చేతనే చచ్చినట్లు
తానూ ఒకమనిషేనా తాడూఒక రొట్టేనా
తానే తుమ్మి తానే శరాయుస్సు అనుకొన్నట్లు
తానే మూగం కాయ తన్నితే మాగునా
తానైవచ్చిన లక్ష్మిని కాలితోతన్ని త్రోయరాదు
తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది
తాబూతే మజ్జిగ లేదంటే పెరుగుకు చీటి వ్రాయమన్నాడట
తాబెట్తినది ముషిణి మొక్కాయినా చేపట్టవలెను
తాబోతూ బొల్లిఎద్దుకు కుడితి అన్నట్లు
తాలిమి తన్నూకచును యెదుట వానిని కాచును
తాళ్ళకు తలమచండ్లు మేకలకు మెడచండ్లు
తాళ్ళపాకవారి కవిత్వము కొంత తనపైత్యము కొంత
తావలచినది రంభ తానుమునిగినది గంగ
తింటేకదలలేను తినకపోతే మెదలలేను
తింటేగాని రుచి చెలియదు దిగితేగాని లోతుతెలియదు
తిండికితిమ్మరాజు పనికిపోతురాజు
తిండికివచ్చినావా తీర్ధానికి వచ్చినావా
తింతలు తూతింవే తూనీతానే తాత్తి తూతిక తాతకతోనా దొందుదొందె
తిట్టిచచ్చినవాడూలేడు దీవించి బ్రతికినవాడూలేడు
తిట్టితేగాలికిపోతవి తింటే లోనికిపోతవి
తిట్టేనోరు కొట్టినా వూరుకుండదు
తిట్టేనోరు తిరిగేకాలు వూరకకుండవు
తిట్తితేకోపం కొట్టితేనొప్పి
తినకపూర్వమురుచి దిగకపూర్వము లోతు తెలియవు
తినమరగినకోది యిల్లెక్కికూసింది
తినమరిగినప్రాణం అల్లాడిచచ్చింది
తిన్నకుక్క తినపోతే కన్నకుక్కనుపట్టి కాళ్లువిరుగగొట్టినట్లు
తిన్నయింటివాసాలు లెక్కించుతావేమిరా అంటే పొరుగింటికిపోతే వూరుకుంటానా అన్నాడట
తిన్నయిల్లు గుద్దలిస్తావెమిరా అంటే తిననియిల్లు నేనేమేరుగుదును అన్నట్లు
తిన్నవాడే మన్నవాడు మన్నవాడే మహారాజు
తిప్పలాడీ మాఅప్పనునుచూచినావా, తీర్ధములో మాబావనుచూచినారా
తిమ్మనిబ్రహ్మిని బ్రహ్కినితిమ్మి చేసేవాడు
తిమ్మన్నబంతికి తియ్యచారూ అన్నము
తిమ్మన్నబంతికి రమ్మంటారు గాబోలు
తిమ్మన్నా తిమ్మన్నా నమస్కారంఅంటే నాపేరునీకేట్లు తెలిసినదంటే నీమొఖమే చెప్పుతుందన్నట్లు
తియ్యగా తియ్యగా రాగము మూలగ్గా మూలగ్గా రోగం
తియ్యనిరోగాలు కమ్మనిమందులు
తిరగమరిగినకాలు తిట్టమరిగిననోరు వూరుకుండవు
తిరపతికిపోగానే తురక దాసరి యగునా
తిరిగితే వరిపొలం తిరగకపోతే అడవిపొలం
తిరిపమెత్తేవానికి పెరుగన్నముకు కరువా
తిరిపెవు మజ్జిగకువచ్చి పాడిబఱ్ఱెను బేరమాడినట్లు
తిలా:పాపహరాన్నిత్యం తలోపిడికెడు పిడికెడు
తీగపట్టుకుంటే డొంక అంతా కదిలినట్లు
తీట పట్టినవాడు గోకు కుంటాడు
తీతువపిట్ట ఆకాశంలోగూడు కడతానన్నట్లు
తుంటిమీద కొట్టితే నోటిపళ్లు రాలినవట
తుడుం తుడుం అంటే దురాయు దురాయి అన్నట్లు
తుడుము కాడినుంచి దేవతార్చనదాకా వొకటేమూట
తుడుము కాడినుంచి దేవతార్చనదాకా వొకటేమూట
తుపాకి కడుపున పిరంగి పుట్టినట్లు
తుప్పర్ల వసేగాని మంత్రాల పసలేదు
తుమ్మితే పోయేముక్కు యెన్నాళ్లుండును
తురక వీధిలో సన్యాసి భిక్ష
తురకలు గొట్టగా చుక్కెదురా
తురకలు లేనివూళ్ళో దూదేకులవాడు సయ్యదుమియ్యా
తులసికోటలో వుమ్మేసినావేమిరా అంటే యజ్ఞవేదిక అనుకున్నాడట
తులసివనంలో గంజాయుమొక్క మొలచినట్లు
తువ్వనవేసిన యెరువు, బాపనికి వేసిననెయ్యి
తూనీగలు ఆడితే తూమెడు వర్షం
తూమెడువడ్లు తూర్పారబట్టే టప్పటికి యేదు మనవడ్లు ఎలుకలు తిన్నవి
తూర్పుకొర్రువేస్తే దుక్కిటెద్దు రంకెవేయును
తూర్పున ఇంద్రధనుస్సు వస్తే తుంగమడిలోను, పడమర ఇంద్రధనుస్సువస్తే బండమీదను పశువులను కట్టవలెను
తూర్పున యింధ్రధనుస్సు దూరాన వాతవర్షం
తెగించి దానము చేస్తాను తేరా పిడికెడు ఆళ్ళు
తెగించి వెనుకకుపోయినంత తెలివితక్కువలేదు
తెగించినవానికి తెడ్డేఆయుధం
తెగోదారికి తేలుకుట్టితే తల్లవార్లూ కోడికూసిందట
తెచ్చుకుంటే భోంచేయి జగన్నాయకా లేకుంటె వూరకుండు జగన్నాయకా
తెడ్డునకు పారగుణము తెలియునా
తెడ్డునాకి వుపవాసాలు మానినట్లు
తెడ్డుయేదీ అంటే కొయ్యయేదీ అన్నట్లు
తెడ్డువుండగా చెయ్యికాల్చుకున్నట్లు
తెలికెలవాడి ముడ్దికిందరాయి
తెలిసి తెలిసి బొందనుపడ్డట్లు
తెలిసినారికి ముందరేవున్నదిమోక్షం
తెలిసేవరకు బ్రహ్మవిద్య తెలిస్తే కూసువిద్య
తెల్లగావుంటేపాలు నల్లగావుంటేనీళ్ళు
తెల్లపూలుపండితే తెల్లజొన్నలు బలుసుపండ్లు పండితే పచ్చజొన్నలు పండును
తేనెతుట్టలు పున్నానికి పూత అమావాస్యకు ఆరగింపు
తేనెవున్నచోట ఈగలు పోగవుతవి
తేరగా వస్తే మాఅన్న యింకొకడునాడు
తేరగాడికి యేమిరా తెల్లజొన్ననూక
తేలుకు యెవరపకారం చేసినారు
తేలుకుపుట్టి చలిపురుగైనట్లు
తేళ్ళల్లోకొండి పాముల్లో పడిగ
తొంగున్న సుంకరీ తలమూట దింపు అన్నట్లు
తొండముదిరి వూసరివెల్లి అయినట్లు
తొంభైతొమ్మండుగురుచేరి తోలుచిరగబొడిచినట్లు
తొక్కలేనమ్మ తొక్కులో నీళ్లుపోసిందట
తొత్తుకు సివమెత్తితే ముక్కకమానునా
తొత్తువలెపాటుపడి దొరవలె తినవలెను
తొలకరి చెరువునిండినా తొలుచూలు కొడుకు పుట్టినా లాభము
తొలకరివానలు మొలకలకు తల్లులు
తొలకరివానలు మొలకలకు తల్లులు
తొలియేకాదశికి తొలితాటిపండు
తోకతొక్కిన పామువలె లేచినాడు
తోకవడ్లుపంట యెన్నుకోత నేస్తం
తోచీతోచనమ్మతోడుకోడలు చెల్లెలుపెళ్ళికి వెళ్లిందట
తోటకూరకు కడిగిపెట్టినయెసరే చాలును
తోడేటిని గొర్రెలు కాయపెట్తినట్లు
తోరణములేనిపెండ్లి వీరణములేనిబాజా యుండవు
తోలుతియ్యకనే తొనలు మెంగేవాడు
త్రాగుటకు ముందు వ్రాతకు వెనుక
తిమ్మన్నబంతికి రమ్మంటారు గాబోలు
తుపాకి కడుపున పిరంగి పుట్టినట్లు
తొత్తువలెపాటుపడి దొరవలె తినవలెను
Post a Comment