Telugu Samethalu Lettter U(ఉ)
ఉంగరాలచేతితో మొట్టితే నొప్పివుండదు
ఉంటే వూరు లేకపోతే పాడు
ఉంటేలిక్కి పోతేకొడవలి
ఉండనిస్తే పండుతుంది ఊడదీస్తే ఎండుతుంది
ఉండలేకపోతే బండకొయ్య బొందను వేయమన్నాడట
ఉండిచూడు వూరిఅందం నానాటికిచూడు నాఅందం
ఉండేదానికి స్థలమిస్తే పండుకొనుటకూ మంచమడిగినట్లు
ఉండేదిగట్టు పోయిందిపొట్టు
ఉండేవల్లా వుండగా ఉపాధ్యాయులవారి భార్యకు దడిబియ్యం
ఉండ్రాళ్ళు పిండివంటాకాదు వూద ధాన్యముకాదు
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గాన కెక్కునా
ఉట్టిమీద వెన్నవుండగా ఊరంతా వెన్నకోసం దేవులాడినట్లు
ఉడకకే ఉడకకే ఓవుల్లిగడ్డ నీవెంత ఉడికినా నీకంపుపోదు
ఉడకవే కుండా ఉగాదిదాకా అంటే నాకేమిపనిలేదు ఏరువాకదాక అన్నట్లు
ఉడతకు ఉడతాభక్తి
ఉడికినమెతుకులు తిని వూళ్ళోఉండేవాణ్ణి నాకు యితరులతో పనియేమిటి
ఉడుకుజుర్రి తే నోరు కాలుతుంది
ఉడుతకేలరా ఊళ్ళోపెత్తనం
ఉడుముకు రెండునాలుకలు
ఉడుముపోయినా చెయ్యివస్తేచాలు
ఉతికెవారికిగాని చాకలి వుతకడు
ఉత్తచెనికన్నా తాటాకుచెవె మేలు
ఉత్తచేతులు మూరవేసినట్లు
ఉత్తముండకన్నా అత్తముండమేలు
ఉత్తర ఉరిమినా పాము తమిరికరచినా తిరుగదు
ఉత్తరకుమార ప్రతిజ్ఞలు
ఉత్తరచూచి యెత్తరగంప
ఉద్యోగం పురుషలక్షణం అదిపోతే అవలక్షణం
ఉద్యోగం పురుషలక్షణం అన్నాడు గొడ్డలితేరా నిట్రాడు నరుకుదాము
ఉన్నది ఒకకూతురు వూరెల్లా అల్లుళ్ళు
ఉన్నమాట అంటే వులుకు
ఉన్నమాట చెప్పితే వూరు అచ్చిరాదు
ఉన్నవాడు ఊరికిపెద్ద, చచ్చినవాడు కాటికిపెద్ద
ఉన్నవూరా, మన్న ప్రజా
ఉన్నశాంతం ఊడ్చుకపోయిందిగాని అసలు కోపమేలేదు
ఉపకారం అంటే వూరినుంచి లేచిపోయినట్లు
ఉపకారమునకు పోతే అపకారం వెంటనే వచ్చినది
ఉపనయనం నాటిమాట ఉండక మానదు
ఉపాధ్యాయులవారు ఉక్తం ఉక్తం
ఉపాధ్యాయులు ఏమి చేస్తున్నాడంటే తప్పులు వ్రాసి దిద్దు కుంటున్నాడు
ఉపాయం యెరగనివాణ్ణీ ఊళ్ళో ఉండనివ్వకూడదు
ఉప్పు తిన్నవాడు నీళ్లుతాగుతాడు
ఉప్పుతో ముప్ఫైఆరు వుంటే ఉత్తముండైనా పండుతుది
ఉప్పునూనె ఊరకరాగా ఆలినిగొట్ట నా వశమా
ఉప్పువాడూ చెడె, పప్పువాడు చెడి, తమలపాకులవాడు తమాంచెడె
ఉభయ బ్రష్టత్వ ఉప్పరి సన్యాసత్వము
ఉభయ భ్రష్టత్వము ఉపరిసన్యాసము
ఉభయవతితోలూ తిని ఉద్ధరిణెకు నీళ్ళూ త్రాగి వూహూ అంటావా ఉత్తమాశ్వమా?
ఉమరువుంటే వుప్పు అమ్ముకొని బ్రతుకవచ్చు
ఉయ్యాలలో పిల్లనువుంచి వూరెల్లా తిరిగినట్లు
ఉరుకు ఉరుకుమనే వారేగాని కూడా ఉరికేవారు లేరు
ఉల్లి పది తల్లుల పెట్టు
ఉల్లి ముట్టనిది వాసనరాదు
ఉల్లిగడ్డ తరిగితే వూరికీనే దు:ఖము వచ్చును
ఉల్లిచేసిన మేలు తల్లి చేయదు
ఉల్లిపాయంత బలిజు ఉంటే వూరంతా చెరుస్తాడు
ఉసురువుంటే వుప్పు అమ్ముకొని బ్రతుకవచ్చు
ఉస్తెకాయ ఊరనెంత అది నంజబెట్టనెంత
ఉడుమును చంకబెట్టుకొని వూళ్లో ప్రవేశించినట్లు
Post a Comment